ఆర్ఆర్ఆర్ ఇప్పట్లో రాదంట!
ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడుతుందనే విషయాన్ని పరోక్షంగా రాజమౌళి చెప్పేశాడు. సెట్స్ పైకి వెళ్తే తప్ప రిలీజ్ డేట్ చెప్పలేమని, ఆల్రెడీ తాము పెట్టుకున్న బఫర్ టైమ్ కూడా అయిపోయిందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అంతా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా ఏడాది పాటు సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ ను వచ్చే ఏడాది జనవరికి అనుకున్నారు. […]
ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడుతుందనే విషయాన్ని పరోక్షంగా రాజమౌళి చెప్పేశాడు. సెట్స్ పైకి వెళ్తే తప్ప రిలీజ్ డేట్ చెప్పలేమని, ఆల్రెడీ తాము పెట్టుకున్న బఫర్ టైమ్ కూడా అయిపోయిందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అంతా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా ఏడాది పాటు సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ ను వచ్చే ఏడాది జనవరికి అనుకున్నారు. అది సాధ్యం కాదు కాబట్టి సమ్మర్ కు రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. అప్పటికీ టైమ్ సరిపోకపోతే దసరాకు వస్తుందనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఏకంగా 2021ను స్కిప్ట్ చేసి.. 2022 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ స్లంప్ లో పడింది. సగం టిక్కెట్లను మాత్రమే అమ్మేలా థియేటర్లపై కొత్త రూల్స్ వచ్చే అవకాశం ఉంది. పైగా ప్రేక్షకులు కూడా కొన్ని నెలల పాటు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ను ఇలాంటి టైమ్ లో రిలీజ్ చేస్తే, రికవరీ చాలా కష్టం.
అందుకే పరిస్థితులన్నీ మెరుగయ్యేంత వరకు ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయకూడదని యూనిట్ అనుకుంటోందట. అంతా బాగానే ఉంది కానీ, అప్పటివరకు తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టాలంటే దానయ్య వల్ల అవుతుందా అనేది అసలు ప్రశ్న.