నేను పెళ్లికి రెడీ.. ఎవరైనా ఉన్నారా?

జబర్దస్త్ షో లో కామెడీ పంచ్ లు వేయడమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హైపర్ ఆది మాటలు అలానే ఉంటాయి. కాస్త సెటైరిక్ గా, ఇంకాస్త కామెడీగా మాట్లాడ్డం ఈ కమెడియన్ స్టయిల్. ఈసారి తన పెళ్లిపై తానే పంచ్ లు వేసుకున్నాడు ఈ నటుడు. తను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని, ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. తన పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా వచ్చే ఏడాది చేసుకుంటాననే చెబుతానంటున్నాడు హైపర్ ఆది. […]

Advertisement
Update:2020-05-17 05:30 IST

జబర్దస్త్ షో లో కామెడీ పంచ్ లు వేయడమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హైపర్ ఆది మాటలు అలానే ఉంటాయి. కాస్త సెటైరిక్ గా, ఇంకాస్త కామెడీగా మాట్లాడ్డం ఈ కమెడియన్ స్టయిల్. ఈసారి తన పెళ్లిపై తానే పంచ్ లు వేసుకున్నాడు ఈ నటుడు. తను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని, ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు.

తన పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా వచ్చే ఏడాది చేసుకుంటాననే చెబుతానంటున్నాడు హైపర్ ఆది. ఎందుకంటే.. ఏళ్లు గడుస్తున్నా తనకు ఎవ్వరూ పిల్లను ఇవ్వడం లేదని కామెడీగా అంటున్నాడు. మరోవైపు ప్రేమ గురించి మాట్లాడుతూ.. తన మాటతీరుకు, తన యాటిట్యూడ్ కు లవ్ ఎఫైర్లు వర్కవుట్ కావని, అందుకే తన పెళ్లి వ్యవహారాన్ని పెద్దల చేతిలో పెట్టానంటున్నాడు.

ఇంట్లో పెద్దోళ్లు మాత్రం తనకు పెళ్లి చేయలేకపోతున్నారని, అందుకే మీడియా వాళ్లు ఎవరడిగినా వచ్చే ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కామన్ గా ఓ డైలాగ్ చెబుతానంటూ జోకులేస్తున్నాడు హైపర్ ఆది.

జబర్దస్త్ స్కిట్ తో పాటు సినిమాల్లో కూడా ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడు హైపర్ ఆది. ఈమధ్య వచ్చిన వెంకీమామ సినిమాతో పాటు చిత్రలహరి, తొలిప్రేమ లో ఆదికి మంచి పాత్రలు పడ్డాయి. సినిమాల పరంగా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఈసారి ఈ కమెడియన్ కు కాస్త త్వరగానే పెళ్లవుతుందేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News