ప్రభాస్ పై పెరుగుతున్న ఒత్తిడి

ఓవైపు నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. నితిన్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. రానా తన పెళ్లి మేటర్ ను ప్రకటించాడు. దీంతో ప్రభాస్ పై ఒత్తిడి పెరుగుతోంది. నిజం చెప్పాలంటే పైన చెప్పుకున్న జాబితాలో హీరోలందరికంటే ప్రభాసే వయసులో పెద్ద. అలాంటి వ్యక్తి ఇంకా పెళ్లి చేసుకోకపోవడం టాలీవుడ్ లో చాన్నాళ్లుగా హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. కానీ ఇప్పుడిలా చర్చించడాల్లేవ్. ఏకంగా ప్రభాస్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఫ్యాన్స్. 40 ఏళ్లొచ్చిన ప్రభాస్ తొందరగా పెళ్లి చేసుకోవాలంటూ […]

Advertisement
Update:2020-05-16 06:30 IST

ఓవైపు నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. నితిన్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. రానా తన పెళ్లి మేటర్ ను ప్రకటించాడు. దీంతో ప్రభాస్ పై ఒత్తిడి పెరుగుతోంది. నిజం చెప్పాలంటే పైన చెప్పుకున్న జాబితాలో హీరోలందరికంటే ప్రభాసే వయసులో పెద్ద. అలాంటి వ్యక్తి ఇంకా పెళ్లి చేసుకోకపోవడం టాలీవుడ్ లో చాన్నాళ్లుగా హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. కానీ ఇప్పుడిలా చర్చించడాల్లేవ్. ఏకంగా ప్రభాస్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఫ్యాన్స్.

40 ఏళ్లొచ్చిన ప్రభాస్ తొందరగా పెళ్లి చేసుకోవాలంటూ అతడి ఫ్యాన్స్, సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే లేవదీస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని, ప్రభాస్ అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. అవసరమైతే సినిమాను ఓ ఏడాది లేట్ చేయమని కూడా సూచిస్తున్నారు.

మొన్నటివరకు కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే ప్రభాస్ కు ఒత్తిడి వచ్చింది. కానీ ఇలా ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా ఒత్తిడి తేవడంతో ప్రభాస్ ఆలోచనలో పడినట్టు కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ పెళ్లిపై ఎప్పట్లానే కృష్ణంరాజు మరోసారి ప్రకటన చేశారు. ఎప్పుడూ చెప్పినట్టుగానే ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసేస్తామంటున్నారు. మరి ప్రభాస్ ఈసారైనా ఒప్పుకుంటాడా?

ప్రస్తుతం ఈ హీరో రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, నాగ్ అశ్విన్ సినిమా ఒకసారి స్టార్ట్ అయిందంటే ఏడాదిపైనే పడుతుంది. ఆ సినిమా కథ అలాంటిది.

Tags:    
Advertisement

Similar News