ఇటలీ రెడ్ ట్రిప్ కళ్లముందు మెదులుతోంది

రెడ్ సినిమా కోసం ఇటలీ వెళ్లింది స్రవంతి మూవీస్ బృందం. అలా వెళ్లి ఇలా వచ్చిన వారం రోజులకే అక్కడ కరోనా విజృంభించింది. రెడ్ సినిమా కోసం వెళ్లిన తామందరం నిజంగానే రెడ్ జోన్ లో పడేవాళ్లమని, అదృష్టవశాత్తూ వారం రోజుల ముందు బయటపడ్డామని చెబుతున్నారు నిర్మాత రవికిషోర్. “రెండు పాట‌లు చిత్రీక‌రించ‌డానికి టీమ్‌తో ఇట‌లీ చేరుకున్నాం. టుస్కాన్‌, ఫ్లారెన్స్, డోల‌మైట్స్ లో హీరో రామ్‌, హీరోయిన్ మాళ‌విక మీద పాట‌లు చిత్రీక‌రించాం. రీసెంట్ గా రిలీజ్ […]

Advertisement
Update:2020-05-09 12:33 IST

రెడ్ సినిమా కోసం ఇటలీ వెళ్లింది స్రవంతి మూవీస్ బృందం. అలా వెళ్లి ఇలా వచ్చిన వారం రోజులకే అక్కడ కరోనా విజృంభించింది. రెడ్ సినిమా కోసం వెళ్లిన తామందరం నిజంగానే రెడ్ జోన్ లో పడేవాళ్లమని, అదృష్టవశాత్తూ వారం రోజుల ముందు బయటపడ్డామని చెబుతున్నారు నిర్మాత రవికిషోర్.

“రెండు పాట‌లు చిత్రీక‌రించ‌డానికి టీమ్‌తో ఇట‌లీ చేరుకున్నాం. టుస్కాన్‌, ఫ్లారెన్స్, డోల‌మైట్స్ లో హీరో రామ్‌, హీరోయిన్ మాళ‌విక మీద పాట‌లు చిత్రీక‌రించాం. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరిక‌ల్ సాంగ్ లో లేక్ గార్డా అందాలు కూడా క‌నిపిస్తాయి. లేక్ గార్డా ప్ర‌స్తావ‌న ఎందుకంటే… ఈప్రాంతం బెర్గామోకి కేవ‌లం గంటంపావు ప్ర‌యాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇట‌లీలో కోవిడ్ 19కి ఎపిక్ సెంట‌ర్‌గా బెర్గామో గురించి అంద‌రికీ తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి15న లేక్ గార్డా‌లోనూ, ఫిబ్ర‌వ‌రి 16న డోల‌మైట్స్ లోనూ షూటింగ్ చేశాం. మేం అక్క‌డి నుంచితిరిగి ఇటొచ్చిన ఆరు రోజుల‌కు… అంటే ఫిబ్ర‌వ‌రి 22న డోల‌మైట్స్ కి బ్రిటిష్ స్కై టీమ్ వెళ్లింది. అక్క‌డికి వెళ్లిన 22 మందిలో 17 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అప్ప‌టిదాకా సుంద‌రంగా, ఫెంటాస్టిక్ ఎక్స్ పీరియ‌న్స్ గా అనిపించిన డోల‌మైట్‌ గురించి ఆలోచించ‌గానే మ‌మ్మ‌ల్ని క‌రోనా క‌ల‌వ‌ర‌పెట్టింది. జ‌స్ట్ వారం రోజులు ముందుగా అక్క‌డినుంచి వ‌చ్చిన మా యూనిట్ అంతా సుర‌క్షితంగా ఉంది.”

ఇలా ఇటలీ టెర్రిబుల్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకున్నాడు రవికిషోర్. జస్ట్ వారం ముందు అక్కడ్నుంచి ఇండియాకు వచ్చామంటే అది అదృష్టం కాక మరేంటని అంటున్నారు రవికిషోర్. ప్రస్తుతం తమ యూనిట్ సభ్యులంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరూ కరోనా బారిన పడలేదని స్పష్టంచేశారు.

Tags:    
Advertisement

Similar News