విశాఖ బాధితుల విషయంలో టీడీపీ రూ.5 కోట్ల ప్రచారం... అసలు నిజం ఏంటంటే...!
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులకు పబ్లిక్ లయబిలిటీ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ) కింద రూ. 5 కోట్లు వస్తాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బాధితులకు న్యాయంగా రూ. 5 కోట్ల బీమా సొమ్ము రావల్సి ఉండగా సీఎం జగన్ ఒక కోటి రూపాయలు మాత్రమే ఎందుకు ప్రకటించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో పీఎల్ఐ మీద వచ్చిన కథనం ఆధారం చేసుకొని ఈ ప్రచారానికి దిగారు. అయితే నిజంగానే […]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులకు పబ్లిక్ లయబిలిటీ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ) కింద రూ. 5 కోట్లు వస్తాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బాధితులకు న్యాయంగా రూ. 5 కోట్ల బీమా సొమ్ము రావల్సి ఉండగా సీఎం జగన్ ఒక కోటి రూపాయలు మాత్రమే ఎందుకు ప్రకటించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో పీఎల్ఐ మీద వచ్చిన కథనం ఆధారం చేసుకొని ఈ ప్రచారానికి దిగారు.
అయితే నిజంగానే బాధితులకు రూ. 5 కోట్లు వస్తాయా..? అని ఆరాతీయగా పలు విషయాలు బయటకు వస్తున్నాయి. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్ పెట్టింది. 1991లో ఈ బిల్ ఆమోదం పొంది చట్టంగా మారింది. దీని ప్రకారం ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు.. ఆ పరిశ్రమతో సంబంధంలేని వ్యక్తులు మరణించినా, గాయపడినా, ఆస్తి నష్టపోయినా పీఎల్ఐ కింద కొంత సొమ్మును అందిస్తారు.
ప్రతీ పరిశ్రమ పీఎల్ఐ కింద రూ. 5 కోట్ల వరకు బీమా చేయించవచ్చు. అంటే ఇది గరిష్టమొత్తమే కాని అంతే ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. సదరు పరిశ్రమ యాజమాన్యం చేయించే బీమా ఆధారంగానే బాధితులకు పరిహారం అందుతుంది.
ఇప్పుడు ప్రమాదం సంభవించిన ఎల్జీ పాలిమర్స్ రూ. 5 కోట్లకు బీమా చేయించి ఉంటే బాధితులకు అంత మొత్తం అందుతుంది. కానీ ఎల్జీ పాలిమర్స్ అసలు ఎంత మొత్తానికి బీమా చేయించిందో కూడా తెలియదు.
ఆంగ్ల పత్రిక గరిష్టంగా రూ. 5 కోట్లు అని రాసేయడంతో టీడీపీ నాయకులు ముందు వెనక చూసుకోకుండా రూ. 5 కోట్ల పరిహారం వస్తుందని ప్రచారంలో పెట్టాయి.
ఎల్జీ పాలిమర్స్‌తో సంబంధం ఉన్న ఒక అధికారి మాట్లాడుతూ.. కంపెనీ చేయించిన బీమా ప్రకారం మృతి చెందిన లేదా శాశ్వత వైకల్యం పొందిన వాళ్లకు రూ. 25 వేలు, ఆసుపత్రి ఖర్చులకు రూ. 12,500, ఆస్తి నష్టానికి 6 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని చెప్పారు.
ఈ విషయాలేవీ తెలియని టీడీపీ నాయకులు రూ. 5 కోట్లను ప్రచారంలో పెట్టి సీఎం చేసిన సాయాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే పలు ప్రజాప్రయోజన విషయాలు అంటూ కోర్టులకు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేలు తెచ్చిన టీడీపీ.. నిన్న సీఎం జగన్ ప్రకటించిన పరిహారంపై కూడా కోర్టుకు ఎక్కుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితుల పక్షాన ప్రభుత్వం ఉన్నా సరే సహించలేక ఇలాంటి అబద్దపు ప్రచారాలకు తెరతీస్తోందంటు కొందరు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.