ముందే జీతాలిచ్చేసిన ఎన్టీఆర్

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఉద్యోగుల్ని చక్కగా చూసుకుంటున్నాడు. అందరికీ అడ్వాన్స్ గా జీతాలు ఇచ్చేశాడు. ఇంకా కావాలంటే అదనంగా కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు. ఎన్టీఆర్ ఇంట్లో, ఆఫీస్ లో దాదాపు 20 మంది పనిచేస్తారు. వీళ్లు కాకుండా ఎన్టీఆర్ కు వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్లందరికీ ఒకేసారి ముందస్తుగా జీతాలు చెల్లించాడు ఎన్టీఆర్. డబ్బుల […]

Advertisement
Update:2020-05-08 13:30 IST

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఉద్యోగుల్ని చక్కగా చూసుకుంటున్నాడు. అందరికీ అడ్వాన్స్ గా జీతాలు ఇచ్చేశాడు. ఇంకా కావాలంటే అదనంగా కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు.

ఎన్టీఆర్ ఇంట్లో, ఆఫీస్ లో దాదాపు 20 మంది పనిచేస్తారు. వీళ్లు కాకుండా ఎన్టీఆర్ కు వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్లందరికీ ఒకేసారి ముందస్తుగా జీతాలు చెల్లించాడు ఎన్టీఆర్. డబ్బుల కోసం ఎవ్వరూ ఇబ్బంది పడొద్దని, ఆర్థిక అవసరం ఉన్నప్పుడు వచ్చి తనను కలవాలని సూచించాడు. దీంతో సిబ్బంది అంతా హ్యాపీగా ఫీలయ్యారు. నిజానికి 40 రోజులుగా ఈ సిబ్బందిలో ఏ ఒక్కరు పనిచేయడం లేదు. చివరికి ఎన్టీఆర్ వ్యక్తిగత సిబ్బంది, ఇంట్లో సిబ్బంది కూడా వర్క్ చేయడం లేదు. అయినప్పటికీ వాళ్లందరికీ జీతాలు చెల్లించాడు తారక్.

అటు కరోనాపై పోరు కోసం కూడా తారక్ 75 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీకి చెరో పాతిక లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. ఇప్పుడు తన సిబ్బందిని కూడా ఆర్థికంగా ఆదుకొని తన పెద్దమనసు చాటుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News