మహేష్, రాజమౌళి సినిమా కథేంటి?

ఇది ఇప్పటి చర్చ కాదు. ఎప్పుడైతే మహేష్ తో సినిమా చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించాడో అప్పట్నుంచి వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా జానర్ పై సోషల్ మీడియాలో దశలవారీగా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఎక్కువమంది మాత్రం రెండంటే రెండు జానర్లకే పరిమితం అయ్యారు. ఒకటి హిస్టారికల్ జానర్ కాగా.. ఇంకోటి జేమ్స్ బాండ్ టైపు యాక్షన్ జానర్. దీనికి కారణం కూడా ఉంది. రీసెంట్ గా రాజమౌళి చేసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు హిస్టారికల్ ఫాంటసీ […]

Advertisement
Update:2020-05-07 03:30 IST

ఇది ఇప్పటి చర్చ కాదు. ఎప్పుడైతే మహేష్ తో సినిమా చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించాడో అప్పట్నుంచి వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా జానర్ పై సోషల్ మీడియాలో దశలవారీగా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఎక్కువమంది మాత్రం రెండంటే రెండు జానర్లకే పరిమితం అయ్యారు.

ఒకటి హిస్టారికల్ జానర్ కాగా.. ఇంకోటి జేమ్స్ బాండ్ టైపు యాక్షన్ జానర్. దీనికి కారణం కూడా ఉంది. రీసెంట్ గా రాజమౌళి చేసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు హిస్టారికల్ ఫాంటసీ కథలు. ఇప్పుడు చేస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కూడా చరిత్రకు సంబంధించిన ఫిక్షన్ కథే.

కాబట్టి తన నెక్ట్స్ మూవీకి కూడా మహేష్ కోసం ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీనే రాజమౌళి సెలక్ట్ చేసుకునే అవకాశం ఉందంటూ వాదిస్తున్నారు చాలామంది.

మరికొందరు మాత్రం గతంలో జరిగిన ఓ ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. గతంలో మహేష్ నటించిన ఓ సినిమా ఫంక్షన్ కు రాజమౌళి హాజరయ్యాడు. మహేష్ తో ఓ సినిమా చేయాలని ఉందని.. గూఢచారి, జేమ్స్ బాండ్, టక్కరిదొంగ సినిమాల టైపులో కౌబాయ్ లేదా స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ జానర్ సినిమా వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు.

అటు రాజమౌళి మాత్రం ఈ సినిమాకు సంబంధించి సీరియస్ గా కథాచర్చల్లో మునిగిపోయాడు. తండ్రి విజయేంద్రప్రసాద్ తో మహేష్ మూవీ కోసం కథాచర్చలు ప్రారంభించిన విషయాన్ని రాజమౌళి కన్ ఫర్మ్ చేశాడు. కాకపోతే ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తాయి.

Tags:    
Advertisement

Similar News