ఈ సీనియర్ నటికి ఇంకా పెళ్లి కాలేదు
ప్రస్తుతం టాలీవుడ్ మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో లీడింగ్ లో ఉన్న వ్యక్తి సితార. ప్రగతి, సితార ఇద్దరూ పోటాపోటీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. హీరోల తల్లిపాత్రలకు వీళ్లు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన సితార, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా అంతే స్పీడ్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. అయితే ఈ నటికి ఇంకా పెళ్లి కాలేదనే విషయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవును.. సితారకు ఇంకా […]
ప్రస్తుతం టాలీవుడ్ మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో లీడింగ్ లో ఉన్న వ్యక్తి సితార. ప్రగతి, సితార ఇద్దరూ పోటాపోటీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. హీరోల తల్లిపాత్రలకు వీళ్లు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన సితార, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా అంతే స్పీడ్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. అయితే ఈ నటికి ఇంకా పెళ్లి కాలేదనే విషయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అవును.. సితారకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తనే స్వయంగా బయటపెట్టింది. దాదాపు 7-8 ఏళ్లు తను పెళ్లి గురించి ఆలోచించలేకపోయానని, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు ఏమాత్రం లేదని అంటోంది సితార. దీనికి ఆమె ఓ రీజన్ కూడా చెబుతున్నారు.
తన తండ్రి అంటే సితారకు చాలా ఇష్టమట. ఏ చిన్న పని చేసినా, జీవితం-కెరీర్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా తండ్రి సలహా పాటిస్తుందట సితార. అలాంటి తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో సితార మానసికంగా కోలుకోలేకపోయారట. ఆ బాధను, ఒంటరితనాన్ని మరిచిపోవడం కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేశారట. అలా బిజీ లైఫ్ లో పడిపోయి పెళ్లి గురించి ఆలోచించలేదంటుంది సితార. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం, దాని వెనక ఇంత బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయం తెలుసుకున్న ఆడియన్స్ షాక్ అవుతున్నారు.