కేంద్రంపై నిప్పులు చెరిగిన సోనియా... వాళ్ల డబ్బులు మేమే ఇస్తాం తీసుకెళ్లండి!

కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకొని పోయిన వారిని సొంతూర్లకు పోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘శ్రామిక్’ రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే సొంతూర్లకు వెళ్లే వారు తమ ప్రయాణపు ఖర్చులు వారే భరించాలని, రైలు టికెట్లు కొంటే కాని తీసుకెళ్లమని తేల్చి చెప్పింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు నాలుగు గంటలే సమయం ఇచ్చి ప్రకటించిన […]

Advertisement
Update:2020-05-04 05:50 IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకొని పోయిన వారిని సొంతూర్లకు పోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘శ్రామిక్’ రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే సొంతూర్లకు వెళ్లే వారు తమ ప్రయాణపు ఖర్చులు వారే భరించాలని, రైలు టికెట్లు కొంటే కాని తీసుకెళ్లమని తేల్చి చెప్పింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు.

లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు నాలుగు గంటలే సమయం ఇచ్చి ప్రకటించిన కేంద్రం ఎంతో మంది చిక్కుకొని పోవడానికి కారణమైందని.. ఇప్పుడు వాళ్లు సొంతూర్లకు వెళ్లాలనుకుంటే చార్జీలు చెల్లించాలనడం దారుణమని ఆమె లేఖలో పేర్కొన్నారు. వారి ప్రయాణానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి ఈ చార్జీలు చెల్లిస్తామని ఆమె లేఖలో వెల్లడించారు.

గుజరాత్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రజలను తరలించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. వీళ్ల ప్రయాణానికి డబ్బులు చెల్లించలేకపోతోందా అని పరోక్షంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. కరోనా ఫండ్ పేరిట రూ.151 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన రైల్వే శాఖ వీరి కోసం ఉచిత ప్రయాణ ఏర్పాట్లు చేయలేదా అని సోనియా మండిపడ్డారు.

1947లో స్వాతంత్రం వచ్చి దేశం విడిపోయిన తర్వాత లక్షలాది మంది నడుస్తూ గ్రామాలకు వెళ్లడం ఇదే తొలిసారని ఆమె గుర్తు చేశారు. వారికి కనీస వసతులు, ఔషధాలు, డబ్బు, రవాణా సౌకర్యం కల్పించడంలో విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం వారి ప్రయాణాలకు మాత్రం చార్జీలు కావాలని అడుగుతుందని ఎద్దేవా చేశారు.

ఇప్పటికీ లక్షల సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్లడానికి నడుస్తూనే ఉన్నారని.. వెంటనే వారికి తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆమె కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News