ఈ పోకిరోడికి 14 ఏళ్లు

ప్రతి ఏటా హిట్స్ వస్తుంటాయి, బ్లాక్ బస్టర్స్ కూడా వస్తుంటాయి. కానీ గేమ్ ఛేంజర్స్ మాత్రం జనరేషన్ గ్యాప్స్ లో వస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి సినిమానే పోకిరి. ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్. అప్పటివరకు ఉన్న మూసను తీసేసింది. టాలీవుడ్ కు కొత్త స్టయిల్ నేర్పించింది. సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు (ఏప్రిల్ 28) విడుదలైంది ఈ యాక్షన్ క్లాసిక్. మహేష్ కెరీర్ ను పోకిరికి ముందు, పోకిరి తర్వాత అని […]

Advertisement
Update:2020-04-28 05:00 IST

ప్రతి ఏటా హిట్స్ వస్తుంటాయి, బ్లాక్ బస్టర్స్ కూడా వస్తుంటాయి. కానీ గేమ్ ఛేంజర్స్ మాత్రం జనరేషన్ గ్యాప్స్ లో వస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి సినిమానే పోకిరి. ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్. అప్పటివరకు ఉన్న మూసను తీసేసింది. టాలీవుడ్ కు కొత్త స్టయిల్ నేర్పించింది. సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు (ఏప్రిల్ 28) విడుదలైంది ఈ యాక్షన్ క్లాసిక్.

మహేష్ కెరీర్ ను పోకిరికి ముందు, పోకిరి తర్వాత అని చెప్పుకోవచ్చు. అంతలా అతడి కెరీర్ ను మార్చేసింది ఈ సినిమా. అప్పటివరకు మహేష్ ప్రిన్స్ మాత్రమే. ఈ సినిమాతో అతడు సూపర్ స్టార్ అయిపోయాడు. అటు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ నంబర్-1 దర్శకుడిగా మారిపోయాడు.

75 ఏళ్ల సినీచరిత్రలో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టింది పోకిరి. హండ్రెడ్ డేస్ లో కానీ, కలెక్షన్లలో కానీ, షేర్ లో కానీ, ఏరియా వైజ్ కానీ… ఇలా ఏ సెగ్మెంట్ లో చూసినా పోకిరి ప్రభంజనం సృష్టించింది. 200 సెంటర్లలో ఈ సినిమా వంద రోజులాడిందంటే.. పోకిరి ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆ తర్వాత కూడా ఈ సినిమా హవా కొనసాగింది. 63 సెంటర్లలో 175 రోజులాడింది. ఆ తర్వాత 15 సెంటర్లలో 200 రోజులాడింది. అంతేకాదు.. 2 సెంటర్లలో ఏకంగా 300 రోజులాడి సరికొత్త రికార్డు సృష్టించింది పోకిరి.

పోకిరిలో పూరి రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్

  • ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు
  • ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా
  • తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా..
  • సినిమాలు చూట్లేదేంటి
  • టైల్స్ ఏస్తున్నారంటగా.. శృతి నాదే.. గన్ నాదే..
Tags:    
Advertisement

Similar News