లారెన్స్, దేవరకొండ... ఇద్దరూ ఇద్దరే

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం తన బాధ్యత గా భావించి […]

Advertisement
Update:2020-04-26 11:31 IST

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం తన బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించానని చెప్పుకొచ్చారు లారెన్స్.

అటు హీరో విజయ్ దేవరకొండ కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనాతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సాయం అందించేందుకు ఏకంగా కోటి 30 లక్షల రూపాయల ఫండ్ ప్రకటించాడు. ఈ ఫండ్ కు మిడిల్ క్లాస్ ఫండ్ అని పేరుపెట్టాడు. ఎవరైతే నిత్యావసరాలు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారో, అలాంటి మధ్యతరగతి కుటుంబాలు విజయ్ దేవరకొండకు చెందిన ఫౌండేషన్ వెబ్ సైట్ లో వివరాలు ఇస్తే.. ఫౌండేషన్ సభ్యులు స్వయంగా ఇంటికొచ్చి కావాల్సిన వస్తువులు అందించి వెళ్తారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలు అందించబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఒకప్పటిలా కాకుండా, ఇప్పుడు తన కోసం 35 మంది స్టాఫ్ పనిచేస్తున్నారని, అంటే.. 35 కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. వాళ్ల బాగోగులు చూసిన తర్వాత ఇప్పుడిలా ఫౌండేషన్ ద్వారా ముందుకొచ్చానని, అందుకే కాస్త ఆలస్యమైందని అంటున్నాడు దేవరకొండ

Tags:    
Advertisement

Similar News