రవిబాబు క్వారంటీన్ కు ఏడాది

ఒక్క నెల రోజులు ఇంట్లో ఉండడానికి కుర్రాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి బయటకు వస్తున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు. అలాంటిది ఏడాదిగా క్వారంటైన్ లో ఉంటే పరిస్థితేంటి? తనది అలాంటి పరిస్థితే అంటున్నాడు రవిబాబు. అంతేకాదు.. తన క్వారంటైన్ కు ఏడాది పూర్తయిందంటూ వార్షికోత్సవం కూడా నిర్వహించాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు రవిబాబు. అందులో బోరున ఏడుస్తుంటాడు. కొడుక్కి ఏమైందో కనుక్కుందామని తండ్రి పరుగున వస్తాడు. ఆ వెంటనే రవిబాబు ఏడుస్తూ […]

Advertisement
Update:2020-04-26 11:15 IST

ఒక్క నెల రోజులు ఇంట్లో ఉండడానికి కుర్రాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి బయటకు వస్తున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు. అలాంటిది ఏడాదిగా క్వారంటైన్ లో ఉంటే పరిస్థితేంటి? తనది అలాంటి పరిస్థితే అంటున్నాడు రవిబాబు. అంతేకాదు.. తన క్వారంటైన్ కు ఏడాది పూర్తయిందంటూ వార్షికోత్సవం కూడా నిర్వహించాడు.

తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు రవిబాబు. అందులో బోరున ఏడుస్తుంటాడు. కొడుక్కి ఏమైందో కనుక్కుందామని తండ్రి పరుగున వస్తాడు. ఆ వెంటనే రవిబాబు ఏడుస్తూ క్యాండిల్ ఊదుతాడు. పక్కనే కరోనా షేపులో ఉన్న కేక్ ను తింటాడు. తండ్రికి తినిపించబోతే ఆయన విసుక్కొని వెళ్లిపోతాడు. దీంతో ఆ కేక్ మొత్తం తనే తినేస్తాడు.

ఇలా రవిబాబు విడుదల చేసిన వార్షికోత్సవ క్వారంటైన్ వీడియో బాగా వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా రవిబాబు తయారుచేసిన కరోనా వైరస్ షేపు కేక్ కు జనాలు బాగా లైకులు కొడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News