రాజమౌళికి వరుస చేదు అనుభవాలు....
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళిపై విమర్శలు మొదలయ్యాయి. ఏ ముహూర్తాన ‘ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టాడో కానీ అప్పటి నుంచి ఆ సినిమా ప్రతీసారి ఏదో ఒక కారణంతో ఆగిపోతూనే ఉంటోంది. మొదట ఎన్టీఆర్ కు జోడీగా డైసీ అనే హాలీవుడ్ నటిని ఎంపిక చేశారు. ఆమె మొదట ఒప్పుకొని ఆ తరువాత నిష్ర్కమించడం రాజమౌళి టీంకు ఘోర అవమానకరమైంది. ఆ షాక్ నుంచి కోలుకొని కొత్త హీరోయిన్ తో షూటింగ్ చేశాకే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక […]
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళిపై విమర్శలు మొదలయ్యాయి. ఏ ముహూర్తాన ‘ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టాడో కానీ అప్పటి నుంచి ఆ సినిమా ప్రతీసారి ఏదో ఒక కారణంతో ఆగిపోతూనే ఉంటోంది.
మొదట ఎన్టీఆర్ కు జోడీగా డైసీ అనే హాలీవుడ్ నటిని ఎంపిక చేశారు. ఆమె మొదట ఒప్పుకొని ఆ తరువాత నిష్ర్కమించడం రాజమౌళి టీంకు ఘోర అవమానకరమైంది. ఆ షాక్ నుంచి కోలుకొని కొత్త హీరోయిన్ తో షూటింగ్ చేశాకే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మధ్యలో ఎన్టీఆర్ కు, రాంచరణ్ కు గాయాలు కావడంతో షూటింగ్ వాయిదా పడింది. వారు కోలుకొని షూటింగ్ మొదలు పెట్టే సమయానికి లాక్ డౌన్ మొదలైంది. ఇప్పటికే హీరోల గాయం కారణంగా జూలైకి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ను సంక్రాంతికి వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో వేసవికి వాయిదా వేస్తున్నారట.
ఇక ఇవన్నీ చాలవన్నట్టు రాజమౌళికి తాజాగా నాలుగు ఆస్కార్ అవార్డులు పొందిన కొరియన్ చిత్రం ‘పారాసైట్’ తనకు అస్సలు నచ్చలేదని.. సినిమా చూస్తుంటే నిద్రవచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. ఆ సినిమాను అవమానిస్తావా అని చాలా మంది రాజమౌళిపై విమర్శలు చేస్తున్నారు.
ఇలా ఆర్ఆర్ఆర్ మొదలుపెట్టినప్పటి నుంచి రాజమౌళికి ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతూనే ఉంది. అయితే వాయిదాలు.. లేదంటే తనపై విమర్శలు.. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళికి ఈ కొత్త కష్టాలు చుట్టుముడుతున్నాయి.