ఆర్ఆర్ఆర్ లో అల్లరి హీరోలు

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. వీళ్లిద్దరూ స్టార్ హీరోలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి మాత్రం వీళ్లను అల్లరి హీరోలు అంటున్నాడు. సెట్స్ లో వీళ్లు చేసే అల్లరి తన సహనానికి పరీక్ష అంటున్నాడు. ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన జక్కన్న.. ఎన్టీఆర్-చరణ్ అల్లరిని బయటపెట్టాడు. “రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఇద్దరే. అల్లరిలో ఎవరి స్టయిల్ వాళ్లది. తారక్ అల్లరి పైకి కనిపిస్తుంది. కానీ రామ్ చరణ్ […]

Advertisement
Update:2020-04-25 12:31 IST

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. వీళ్లిద్దరూ స్టార్ హీరోలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి మాత్రం వీళ్లను అల్లరి హీరోలు అంటున్నాడు. సెట్స్ లో వీళ్లు చేసే అల్లరి తన సహనానికి పరీక్ష అంటున్నాడు. ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన జక్కన్న.. ఎన్టీఆర్-చరణ్ అల్లరిని బయటపెట్టాడు.

“రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఇద్దరే. అల్లరిలో ఎవరి స్టయిల్ వాళ్లది. తారక్ అల్లరి పైకి కనిపిస్తుంది. కానీ రామ్ చరణ్ చేసే అల్లరి పైకి కనిపించదు. ఇక ఇద్దరూ కలిశారంటే ఆ రోజు నాకు టెన్షన్. తారక్ కు నేను ఏదో ఒక సీన్ సీరియస్ గా చెబుతుంటాను. పక్కనే ఉన్న చరణ్ కామ్ గా ఉండడు. రకరకాల చేష్టలతో తారక్ ను ఆటపట్టిస్తుంటాడు.”

ఇలా సెట్స్ లో రామ్ చరణ్, తారక్ అల్లరి గురించి బయటపెట్టాడు రాజమౌళి. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తనకు తెలుసని, కాకపోతే ఇంత క్లోజ్ గా ఉంటారనే విషయం మాత్రం తనకు ఆర్ఆర్ఆర్ ప్రారంభమైన తర్వాత తెలిసిందంటున్నాడు జక్కన్న.

Tags:    
Advertisement

Similar News