కుప్పం వైసీపీ ఇంచార్జ్ చంద్రమౌళి మృతి
వైసీపీ నేత, మాజీ ఐఏఎస్ కె. చంద్రమౌళి మృతిచెందారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్‌గా చంద్రమౌళి ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న చంద్రమౌళి… హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చంద్రమౌళి 1990 ఐఏఎస్ బ్యాచ్. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి రెండుసార్లు చంద్రబాబు మీద పోటీ చేసి ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు 1,02,952 ఓట్లు […]
వైసీపీ నేత, మాజీ ఐఏఎస్ కె. చంద్రమౌళి మృతిచెందారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్‌గా చంద్రమౌళి ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న చంద్రమౌళి… హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
చంద్రమౌళి 1990 ఐఏఎస్ బ్యాచ్. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి రెండుసార్లు చంద్రబాబు మీద పోటీ చేసి ఓడిపోయారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు 1,02,952 ఓట్లు వస్తే, చంద్రమౌళికి 55,839 ఓట్లు వచ్చాయి. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు 1,00,146 ఓట్లు వస్తే, చంద్రమౌళికి 69,424 ఓట్లు వచ్చాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో ఉండగానే ఆయన తరపున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గించడంలో చంద్రమౌళి కీలకపాత్ర పోషించారు.
చంద్రమౌళి మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళి కుప్పం నియోజకవర్గంలో క్రియాశీలంగా పనిచేశారని గుర్తు చేశారు. సివిల్ సర్వెంట్‌గా, వైసీపీ నేతగా చంద్రమౌళి చేసిన సేవల ద్వారా ఆయన ప్రజల్లో గుర్తుండిపోతారని అన్నారు.