దెబ్బకు రాయపాటి యూ టర్న్

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మవారిని పక్కన పెడుతోందని… కమ్మవారు ఏం చేస్తారులే అనుకోవద్దు… కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు అంటూ బుధవారం వ్యాఖ్యానించిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు…. వైసీపీ నుంచి వచ్చిన దాడితో యూ టర్న్ తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు కూడా దండెత్తారు. పొగాకు బదులు బండరాళ్లను చైనాకు ఎగుమతి చేసి అక్కడ కొందరు అధికారులు ఉరికంబం ఎక్కడానికి రాయపాటి కారకులైన ఉదంతం నుంచి… తారా చౌదరి ఎపిసోడ్ వరకు గుర్తు […]

Advertisement
Update:2020-04-16 12:21 IST

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మవారిని పక్కన పెడుతోందని… కమ్మవారు ఏం చేస్తారులే అనుకోవద్దు… కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు అంటూ బుధవారం వ్యాఖ్యానించిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు…. వైసీపీ నుంచి వచ్చిన దాడితో యూ టర్న్ తీసుకున్నాడు.

సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు కూడా దండెత్తారు. పొగాకు బదులు బండరాళ్లను చైనాకు ఎగుమతి చేసి అక్కడ కొందరు అధికారులు ఉరికంబం ఎక్కడానికి రాయపాటి కారకులైన ఉదంతం నుంచి… తారా చౌదరి ఎపిసోడ్ వరకు గుర్తు చేస్తూ రాయపాటిపై విరుచుకుపడ్డారు. ఈ పౌరుషం ఏదో బ్యాంకులకు ఎగొట్టిన వేల కోట్లు తిరిగి చెల్లించడంతో ప్రదర్శించవచ్చు కదా అని మరికొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు. కొందరు నేరుగా ఆయనకే ఫోన్లు చేశారు.

అటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. రాయపాటి లాంటి వారు కులం జోలికి వస్తే లేపేస్తామంటూ… కులాలను విభజించే భయంకరమైన వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులం జోలికి వస్తే ముఖ్యమంత్రిని లేపేస్తామంటున్న వారు ధైర్యం ఉంటే… రోడ్లపైకి రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ చేశారు.

ముఖ్యమంత్రినే లేపేస్తామని వ్యాఖ్యానించిన రాయపాటి… ఒక్కసారిగా అందరూ తనను టార్గెట్ చేయడంతో ఉలిక్కిపడ్డాడు. మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు అబ్బే తాను అలా అనలేదు అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. కమ్మవారితో పెట్టుకుంటే సీఎం లేచిపోతాడని తాను ఎక్కడా వ్యాఖ్యానించలేదని చెప్పాడు. తాను అనని మాటలను మీడియాలో ప్రచారం చేశారని వివరించాడు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై తనకు ఎలాంటి ధ్వేషం లేదని… జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తాను మంచి సన్నిహితులమని రాయపాటి చెప్పాడు. జగన్ పది కాలాల పాటు సీఎంగా కొనసాగాలంటే అందరినీ కలుపుకుపోవాలన్న ఉద్దేశంతోనే తాను సలహా మాత్రమే ఇచ్చానని రాయపాటి చెప్పాడు. తాను అనని మాటలు ప్రచారంలోకి రావడంతో రాత్రి నుంచి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని… సోషల్ మీడియాలోనూ తనపై చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు పెడుతున్నారని రాయపాటి ఆవేదన చెందాడు.

Tags:    
Advertisement

Similar News