బాక్సుల్లోనే ఆ హీరో 4 సినిమాలు... విడుదల కష్టమేనా?

అందమైన ప్రేమకథతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో ఇప్పుడు లాక్ డౌన్ తో వచ్చిన సంక్షోభం కారణంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించిన ఆ యువ హీరో సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. మీడియం, స్టార్ హీరోల చిత్రాల్లో నెగెటివ్ క్యారెక్టర్ లు కూడా చేశాడు. ప్రస్తుతం ఆ యువ హీరో నాలుగు చిత్రాలు విడుదల కోసం వేచి ఉన్నాయట.. కానీ ఇప్పుడు లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ తో […]

Advertisement
Update:2020-04-15 08:47 IST

అందమైన ప్రేమకథతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో ఇప్పుడు లాక్ డౌన్ తో వచ్చిన సంక్షోభం కారణంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించిన ఆ యువ హీరో సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. మీడియం, స్టార్ హీరోల చిత్రాల్లో నెగెటివ్ క్యారెక్టర్ లు కూడా చేశాడు.

ప్రస్తుతం ఆ యువ హీరో నాలుగు చిత్రాలు విడుదల కోసం వేచి ఉన్నాయట.. కానీ ఇప్పుడు లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ తో ఆ సినిమాల విడుదలనే డోలాయమానంలో పడిపోయాయి. అవి బాక్సుల్లోనే చిక్కుకొని పోయాయి.

డిసెంబర్ లోనే పూర్తైన ఆ సినిమాలు విడుదల కోసం వేచి ఉన్నాయి. కానీ సంక్రాంతి, ఆ తర్వాత పెద్ద సినిమాల తాకిడికి వేసవిలో విడుదల చేద్దామని నిర్మాతలు భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆ నిర్మాతల ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ఇప్పుడు ఈ హీరోను నమ్మి సినిమాలు తీసిన నిర్మాతలు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.

ఇక ఈ హీరో సినిమాలను కొనేందుకు ఏ పంపిణీదారు ఆసక్తి చూపడం లేదట.. ఇక ఫాలోయింగ్ లేని, విజయాలు లేని ఈ హీరోతో సినిమాలు చేయవద్దని ఫిల్మ్ చాంబర్ నిర్మాతలు డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ హీరో ఇక వెబ్ సిరీస్ లు చేస్తేనే బెటర్ అని అంటున్నారు. కానీ అతడితో వెబ్ సిరీస్ లు చేయడానికి ఎవరు ముందుకు వస్తారో తెలియని పరిస్థితి ఉందట.. ఇప్పుడు ఈ హీరో నాలుగు సినిమాలు విడుదల అవుతాయా? బాక్సులకే పరిమితం అవుతాయా అన్నది వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News