చిరంజీవిని ప్రశంసించిన అమితాబ్... ఎందుకంటే...

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో అందరికంటే ముందు స్పందించిన తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ విపత్కర పరిస్థితుల్లో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఏకంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ఏర్పాటు చేసి కార్మికులకు సహాయం అందజేస్తున్నారు. ఎన్ శంకర్, తమ్మారెడ్డి, మెహర్ రమేశ్ లు దగ్గరుండి మరీ ఈ సేవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మంగళవారం ఒక్కరోజే 1000మంది సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు. దీంతో చిరంజీవి సహా ప్రముఖులు వారిని […]

Advertisement
Update:2020-04-15 12:04 IST

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో అందరికంటే ముందు స్పందించిన తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ విపత్కర పరిస్థితుల్లో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఏకంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ఏర్పాటు చేసి కార్మికులకు సహాయం అందజేస్తున్నారు.

ఎన్ శంకర్, తమ్మారెడ్డి, మెహర్ రమేశ్ లు దగ్గరుండి మరీ ఈ సేవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మంగళవారం ఒక్కరోజే 1000మంది సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు. దీంతో చిరంజీవి సహా ప్రముఖులు వారిని ప్రశంసించారు.

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా చిరంజీవికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారట. ఇంత క్రైసిస్ లో 1000 మందికి ఎలా పంపిణీ చేశారని అడిగి తెలుసుకొని ప్రశంసించాడట.

దీనిపై ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి ప్రతి ఒక్కరం బాధ్యతగా భావించి, ముందుకొచ్చి ఈ పనిచేశామని అమితాబ్ కు వివరించారట. తనకు సహకరించిన తమ్మారెడ్డి, ఎన్ శంకర్, మెహర్ రమేశ్ లకు ప్రత్యేక అభినందనలు అని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు.

Tags:    
Advertisement

Similar News