ఒక్కరోజులోనే 61 కరోనా కేసులు.... గ్రేటర్‌పై సీఎం ఫోకస్
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 61 కేసులు బయటపడ్డాయి. ఒకరు మృతిచెందారు. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 592కిచేరింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 216 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ కరోనాతో తెలంగాణలో 17 మంది చనిపోయారు. 103 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ తర్వాత నిజమాబాద్‌లో 35, రంగారెడ్డిలో 20, వికారాబాద్‌లో 24, వరంగల్ అర్బన్ 21, గద్వాలలో 20, సూర్యాపేటలో 20, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 18 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత […]
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 61 కేసులు బయటపడ్డాయి. ఒకరు మృతిచెందారు. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 592కిచేరింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 216 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ కరోనాతో తెలంగాణలో 17 మంది చనిపోయారు. 103 మంది డిశ్చార్జి అయ్యారు.
జీహెచ్‌ఎంసీ తర్వాత నిజమాబాద్‌లో 35, రంగారెడ్డిలో 20, వికారాబాద్‌లో 24, వరంగల్ అర్బన్ 21, గద్వాలలో 20, సూర్యాపేటలో 20, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 18 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత నల్గొండలో 12, మహబూబ్‌నగర్‌లో 10, ఆదిలాబాద్‌లో 11 కేసులు నమోదు అయ్యాయి. కరీనంగర్‌లో నాలుగు కేసులు ఉంటే…ఇప్పటివరకూ 14 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెప్పింది. జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కేసులు బయటపడడంతో…. హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ల ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
దేశంలో, రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరులో నాలుగు, గుంటూరులో మూడు పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది.
దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 439కి చేరినట్లు తెలిపింది. ఇప్పటివరకూ ఏడుగురు మరణించారు. ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 93 మంది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 56 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా 41, కృష్ణా జిల్లాలో 36, కడపలో 31, చిత్తూరులో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 23, విశాఖలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 17, అనంతపురంలో 15 మందికి కరోనా సోకింది.