జగన్ ప్లాన్‌కు మోదీ ఒకే... మూడు జోన్లుగా లాక్‌డౌన్ !
లాక్‌డౌన్‌పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఏప్రిల్ 14 తర్వాత కేంద్రం లాక్‌డౌన్ ను పొడిగిస్తుందా? లేక రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తుందా? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిషాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానమంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించకుండా…జోన్లవారీగా […]
లాక్‌డౌన్‌పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఏప్రిల్ 14 తర్వాత కేంద్రం లాక్‌డౌన్ ను పొడిగిస్తుందా? లేక రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తుందా? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిషాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రధానమంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించకుండా…జోన్లవారీగా విభజించాలని సూచించారు. ఈ జోన్ల వారీగా లాక్‌డౌన్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు జగన్‌తో పాటు పలు సూచనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్లవారీగా విభజించేందుకు రెడీ అవుతోంది.
రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా దేశంలోని ప్రాంతాలను విభజించబోతున్నారు. దేశంలోని మొత్తం 400 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలను గ్రీన్‌జోన్ కింద ఉంచబోతున్నారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఆరెంజ్ జోన్ కింద 15 కంటే తక్కువ కేసులు నమోదు అయిన ప్రాంతాలను ఈ జోన్ కింద పెడతారు. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకపోతే ఈ ఏరియాలు ఆరెంజ్ జోన్ల కిందకు వస్తాయి. ఇక్కడ మినిమమ్ యాక్టివిటీకి అనుమతి ఇస్తారు. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, వ్యవసాయ పనులకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు.
15 కేసుల కంటే ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాలను రెడ్‌జోన్‌ల కిందకు తీసుకువస్తారు. ఇక్కడ ఎలాంటి యాక్టివిటీకి చాన్స్ లేదు. ఈ ప్రాంతాలను పూర్తిగా మూసివేసి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఇంటింటికి నిత్యావసరాలు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో కొంచెం యాక్టివిటీ పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14తో 21 రోజుల లాక్‌డౌన్ గడువు ముగుస్తోంది. దీంతో రేపోమాపో లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
మనదేశ వృద్ధిరేటు ఈ ఏడాది 1.5 నుంచి 2.8 శాతం మధ్య నమోదు అవుతుందని ప్రపంచబ్యాంకు అంచనా. దీంతో రోజువారీ కూలీపై ఆధారపడి బతికే వలస కూలీలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు కొంత వెసులుబాటు కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఏఏ రంగాలకు వెసులుబాటు కల్పిస్తారు అనే దానిపై కేంద్ర హోంశాఖ ఓ నోట్ విడుదల చేసే అవకాశం కన్పిస్తోంది.
పుడ్ ప్రాసెసింగ్, ఏవియేషన్, ఫార్మాసిటికల్స్, ఇండస్ట్రీ, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో పనులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
అయితే లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించి ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఓ కలర్ కోడ్ రూపొందిస్తారని తెలుస్తోంది. భారతదేశ మ్యాప్ లో కలర్ జోన్లను గుర్తించనున్నారు. రెడ్ – ఆరెంజ్ – గ్రీన్ రంగుల్లో భారతదేశంలోని ప్రాంతాలను గుర్తిస్తారు. ఈ మూడు రంగులను విభజించడం వల్ల ప్రజల రాకపోకలకు అవరోధం ఉండదని – ఆర్థిక వ్యవస్థను కొంత పునరుద్ధరించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా ప్రభావం చూపని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను సడలించే అవకాశాలు ఉన్నాయి. ఆ మూడు రంగుల జోన్ల ఏమిటంటే..
గ్రీన్ జోన్: ఈ జోన్ పరిధి కిందకు వచ్ఛే ప్రాంతాలంటే కరోనా ప్రభావం పూర్తిగా లేని జిల్లాలుగా గుర్తిస్తారు. దేశంలో ప్రస్తుతం 400 జిల్లాల్లో కరోనా కేసులు లేవని ప్రభుత్వం గుర్తించింది.
ఆరెంజ్ జోన్: కొన్ని ప్రాంతాల్లో లేదా జిల్లాలో 15కు మించి కరోనా కేసులు ఉన్న వాటిని గుర్తిస్తారు. ఆ సంఖ్య కొంచెం పెరగొచ్చు.. తగ్గొచ్చు. ఈ విధమైన జిల్లాల్లో పరిమితంగా ప్రజా రవాణాను అనుమతించడం – వ్యవసాయోత్పత్తులకు అనువుగా హార్వెస్టింగ్ కి అనుమతి ఇస్తారని సమాచారం.
రెడ్ జోన్: 15 కరోనా కేసులకు మించిన జిల్లాలను రెడ్ జోన్ కిందకు చేర్చారు. అంటే కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ సంపూర్ణగా విధించనున్నారు. ఎలాంటి సడలింపులు లేకుండా తీవ్ర ఆంక్షలు అమలుచేసే జోన్ ఇది.