ఏపీ సర్కారు దూకుడు... అత్యవసర ఆదేశాలు జారీ

ఎవరేమనుకున్నా సరే.. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకూ విమర్శలకు తావు లేకుండా కరోనా నియంత్రణ చర్యలు అమలు చేస్తూ వచ్చిన సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రయివేటు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసి.. సరికొత్త చర్చకు తెర తీసింది. తాజా ఆదేశాల ఫలితంగా జరిగేది ఏంటంటే.. కరోనా నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు వస్తే.. ప్రయివేటు ఆస్పుత్రులన్నీ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. అంటే.. […]

Advertisement
Update:2020-03-31 07:12 IST

ఎవరేమనుకున్నా సరే.. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకూ విమర్శలకు తావు లేకుండా కరోనా నియంత్రణ చర్యలు అమలు చేస్తూ వచ్చిన సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రయివేటు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసి.. సరికొత్త చర్చకు తెర తీసింది.

తాజా ఆదేశాల ఫలితంగా జరిగేది ఏంటంటే.. కరోనా నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు వస్తే.. ప్రయివేటు ఆస్పుత్రులన్నీ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. అంటే.. బెడ్స్ దగ్గరనుంచి మొదలు.. ప్రయోగశాలలు, వైద్య పరికరాలు, కీలకమైన వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది.. ఇలా.. అది ఇదీ అని లేకుండా అన్నీ ప్రభుత్వం చేతిలోకి వచ్చి.. ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అవకాశం కలుగుతుంది.

ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాలైతే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించలేదు. కానీ.. జగన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అడుగు ముందుకు వేసినట్టుగానే కనిపిస్తోంది. ఆదాయం సరిగా లేని వేళ.. కేంద్రం నుంచి ఆర్థిక అండ అంతగా లేని వేళ.. ముంచుకొచ్చిన ఈ ముప్పును.. ముందు జాగ్రత్తలతోనే నివారిస్తే తర్వాత తమకు, ప్రజలకు భారం కాకుండా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

అందుకే.. ప్రయివేటు ఆసుపత్రులను తమ నియంత్రణలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడైతే వాటిని చికిత్సలో భాగం చేయడం లేదు. కానీ.. పరిస్థితి చేయి దాటితే మాత్రం కచ్చితంగా వాడుకునేందుకు తగిన చర్యలైతే తాజా ఆదేశాలతో తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News