సెట్స్ పైకి మరో క్రేజీ కాంబినేషన్

కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు. ఇక దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతడి సినిమాలకు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా గౌతమ్ మీనన్ సినిమాల్లో అతడి మార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలవబోతున్నారు. గతంలో గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కలిసి వెట్టైయాడు విళయాడు అనే సినిమా చేశాడు. తమిళనాట అది పెద్ద హిట్టయింది. అందులో కమల్ […]

Advertisement
Update:2020-03-29 00:33 IST
సెట్స్ పైకి మరో క్రేజీ కాంబినేషన్
  • whatsapp icon

కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు. ఇక దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతడి సినిమాలకు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా గౌతమ్ మీనన్ సినిమాల్లో అతడి మార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలవబోతున్నారు.

గతంలో గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కలిసి వెట్టైయాడు విళయాడు అనే సినిమా చేశాడు. తమిళనాట అది పెద్ద హిట్టయింది. అందులో కమల్ పోలీసాఫీసర్ గా నటించాడు. జ్యోతిక హీరోయిన్ గా నటించింది. అదే సినిమా తెలుగులో ‘రాఘవన్’ పేరిట డబ్ అయి, ఇక్కడ కూడా ఓ మోస్తరుగా ఆడింది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు గౌతమ్ మీనన్. ఆల్రెడీ కమల్ తో చర్చలు కూడా షురూ చేశాడు. కమల్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఓ నెల రోజుల పాటు స్క్రిప్ట్ పై కూర్చొని, ఫినిషింగ్ టచ్ ఇచ్చి, ఏప్రిల్ లో కమల్ సర్ కు ఫైనల్ నెరేషన్ ఇస్తానంటున్నాడు గౌతమ్ మీనన్. ఈ క్వారంటైన్ టైమ్ ను గౌతమ్ మీనన్ ఇలా ఉపయోగించు కుంటున్నాడన్న మాట.

Tags:    
Advertisement

Similar News