ఏపీ ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం

కరోనా మహమ్మారి కారణంగా ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేక వాయిదా వేశారు. కాగా ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలను వెల్లడించారు. రాబోయే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఓటాన్ […]

Advertisement
Update:2020-03-27 09:24 IST

కరోనా మహమ్మారి కారణంగా ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేక వాయిదా వేశారు. కాగా ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలను వెల్లడించారు.

రాబోయే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఓటాన్ బడ్జెట్ కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇక కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందన్నారు. కరోనా బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 100 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాని చెప్పారు. ప్రజలందరూ కరోనా వ్యాపించకుండా స్వీయ నియంత్రణ విధించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనాకు సంబంధించి 104 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలోకి ప్రవేశించే వ్యక్తులు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్దపడితేనే అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఏపీ ప్రజలు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని మంత్రి సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలకు అవసరం అయిన భోజనం, వసతి ఏర్పాట్లు చేయడానికి మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం సంప్రదింపులు జరుపుతుందని నాని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలోనికి 28 వేల మంది విదేశాల నుంచి ప్రవేశించారని.. వారందరి వివరాలు సేకరించామని.. వాళ్లందరూ స్వీయ నియంత్రణలో లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇక రాష్ట్రంలోని 13 ప్రైవేటు కళాశాలలను కరోనా ఆసుపత్రులుగా ఉపయోగించనున్నట్లు నాని చెప్పారు. ఇప్పటికే 52వేల ఎన్95 మాస్కులు, 4 వేల పీపీఈలు, 400 వెంటిలేటర్లు, 10 లక్షల సర్జికల్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు.

Tags:    
Advertisement

Similar News