రానా సినిమా కూడా వాయిదా

కరోనా ప్రభావం రానా సినిమాపై కూడా పడింది. దాదాపు ఏడాదిన్నర కష్టపడి రానా తీసిన ఈ సినిమా వాయిదా పడింది. లెక్కప్రకారం.. ఏప్రిల్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ ఇప్పుడా తేదీకి రావడం లేదని స్వయంగా రానా ప్రకటించాడు. కరోనా ప్రభావంతో వాయిదాపడిన మొట్టమొదటి పాన్-ఇండియన్ మూవీగా నిలిచింది అరణ్య. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు. హిందీలో దీనికి హాథీ […]

Advertisement
Update:2020-03-17 05:42 IST

కరోనా ప్రభావం రానా సినిమాపై కూడా పడింది. దాదాపు ఏడాదిన్నర కష్టపడి రానా తీసిన ఈ సినిమా వాయిదా పడింది. లెక్కప్రకారం.. ఏప్రిల్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ ఇప్పుడా తేదీకి రావడం లేదని స్వయంగా రానా ప్రకటించాడు. కరోనా ప్రభావంతో వాయిదాపడిన మొట్టమొదటి పాన్-ఇండియన్ మూవీగా నిలిచింది అరణ్య.

ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు. హిందీలో దీనికి హాథీ మేరీ సాథీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రమోషన్ కూడా భారీ ఎత్తున స్టార్ట్ చేశారు. అయితే అనుకోని విధంగా కరోనా రావడంతో.. థియేటర్లు బంద్ అయ్యాయి. మరీ ముఖ్యంగా కేరళ, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో థియేటర్లు మూసేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ ను నిలిపివేశారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అడవిని పరిరక్షించే వ్యక్తి పాత్రలో రానా కనిపిస్తున్నాడు. తన స్వలాభం కోసం అడవిని నరికేస్తున్న వ్యక్తులు, వ్యవస్థపై రానా ఎలా యుద్ధం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

Tags:    
Advertisement

Similar News