పాత ప్లాన్.. మహేష్ కాదు చరణే!

ఆచార్య సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ ఇది. మొన్నటివరకు ఈ సినిమాలో మహేష్ బాబు దాదాపు ఫిక్స్ అనుకున్నారు. అటుఇటుగా అర్థగంట నిడివి ఉన్న ఈ పాత్రను చేసేందుకు మహేష్ దాదాపు ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. ఇంతకుముందు అనుకున్నట్టే రామ్ చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉంది. 30 నిమిషాల నిడివి ఉన్న […]

Advertisement
Update:2020-03-13 15:34 IST
పాత ప్లాన్.. మహేష్ కాదు చరణే!
  • whatsapp icon

ఆచార్య సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ ఇది. మొన్నటివరకు ఈ సినిమాలో మహేష్ బాబు దాదాపు ఫిక్స్ అనుకున్నారు. అటుఇటుగా అర్థగంట నిడివి ఉన్న ఈ పాత్రను చేసేందుకు మహేష్ దాదాపు ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. ఇంతకుముందు అనుకున్నట్టే రామ్ చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉంది. 30 నిమిషాల నిడివి ఉన్న ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే దాన్ని రామ్ చరణ్ తో చేయించాలని ముందుగా భావించాడు చిరంజీవి. మళ్లీ తామిద్దరికీ అలాంటి పాత్రలు పడవని అనుకున్నాడు. కానీ కొరటాల మాత్రం ఆ క్యారెక్టర్ ను మహేష్ తో చేయిస్తే బాగుంటుందని భావించాడు. మొదట చిరంజీవి ఒప్పుకున్నప్పటికీ, తాజాగా మహేష్ స్థానంలో తిరిగి చరణ్ నే కొనసాగించాలని నిర్ణయించారట మెగాస్టార్.

మొత్తమ్మీద మెగా తండ్రికొడుకులు కలిసి మరోసారి తెరపైకి రాబోతున్నారు. ఇంతకుముందు మగధీర, బ్రూస్ లీ లాంటి సినిమాల్లో ఒకే తెరపై మెరిశారు చిరంజీవి-రామ్ చరణ్. కానీ వాటిలో చిరంజీవిది గెస్ట్ రోల్ మాత్రమే. కానీ ఈసారి చిరంజీవి హీరో. అతడి సినిమాలో చరణ్ ది అత్యంత కీలకమైన పాత్ర. అందుకే ఆచార్య ఇప్పుడు వెరీ వెరీ స్పెషల్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News