ఇంట్రెస్టింగ్: నాడు తెలంగాణలో... నేడు ఆంధ్రప్రదేశ్ లో !

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయన్నది ఎవరూ చెప్పలేరు. ఏ క్షణాన ఏం జరుగుతుందన్నది ఎవరూ ఊహించలేరు. క్షణం ముందు వరకూ ఆగర్భ శత్రువులుగా ఉన్న నేతలు కాస్తా… ప్రాణ మిత్రులుగా మారిపోవడాన్ని కూడా ఎవరూ గుర్తించలేరు. ఇలాంటివి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ రెండు సంఘటనలు మాత్రం కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి. రెండు చోట్లా ఉన్న కామన్ పాయింట్ కూడా.. ప్రజలకు ఆసక్తి కలిగించేదే. ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల సతీష్ […]

Advertisement
Update:2020-03-11 06:30 IST

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయన్నది ఎవరూ చెప్పలేరు. ఏ క్షణాన ఏం జరుగుతుందన్నది ఎవరూ ఊహించలేరు. క్షణం ముందు వరకూ ఆగర్భ శత్రువులుగా ఉన్న నేతలు కాస్తా… ప్రాణ మిత్రులుగా మారిపోవడాన్ని కూడా ఎవరూ గుర్తించలేరు. ఇలాంటివి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ రెండు సంఘటనలు మాత్రం కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి. రెండు చోట్లా ఉన్న కామన్ పాయింట్ కూడా.. ప్రజలకు ఆసక్తి కలిగించేదే.

ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల సతీష్ రెడ్డి వ్యవహారంతో… ఈ విషయం చర్చకు వచ్చింది. వాస్తవానికి.. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత బలమైంది. అక్కడ ఆయన కుటుంబం నుంచి ఎవరు నిలుచున్నా.. సులభంగా గెలుస్తారు అన్న పేరు చాలా కాలంగా ఉంది. ఫలితాలు కూడా అందుకు అనుకూలంగానే వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ, జగన్.. ఇలా ఆ కుటుంబ సభ్యులే.. పులివెందుల ప్రాంతాన్ని ఏలారు.

అలాంటి చోట… ఆ కుటుంబంతో టీడీపీ తరఫున ఒకే ఒక్కడుగా పోరాడిన సతీష్… చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది. టీడీపీకి భవిష్యత్తు లేదని అర్థం చేసుకున్న ఆయన.. ప్రజల మద్దతు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లడమే సరైన నిర్ణయమని భావించాల్సి వచ్చింది. ఈ పరిణామం…. కొన్నాళ్ల క్రితం తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితిని గుర్తు చేస్తోంది.

గజ్వేల్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అనూహ్య ప్రజా మద్దతు కూడగట్టుకున్న వేళ.. ఆయన్నే ఢీ కొట్టి సవాల్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ తో సై అంటే సై అంటూ.. నిలబడి కలబడి.. టీఆర్ఎస్ తో తలపడి.. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఆకర్షించారు. కానీ.. టీఆర్ఎస్ కు దక్కిన ప్రజాభిమానానికి తలవంచి.. ఆ పార్టీలోకే వెళ్లిపోయారు.

ఇలా… ముఖ్యమంత్రులు ఇద్దరి నియోజక వర్గాల్లోని ప్రత్యర్థులు… తిరిగి తిరిగి… వారి గూటికి చేరడమే… ఈ రెండు సందర్భాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News