స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సంచలన ఆదేశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ముందు నుంచి వార్తలు వినిపించినట్టే.. అతి త్వరలో.. నెలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించడం.. ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని.. ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అవినీతి రహితంగా ఎన్నికల నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యతను అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరించారు. స్థానికేతరులు వచ్చి గెలవడం కాదని.. […]

Advertisement
Update:2020-03-04 01:05 IST

స్థానిక సంస్థల ఎన్నికలపై.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ముందు నుంచి వార్తలు వినిపించినట్టే.. అతి త్వరలో.. నెలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించడం.. ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని.. ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

అవినీతి రహితంగా ఎన్నికల నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యతను అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరించారు. స్థానికేతరులు వచ్చి గెలవడం కాదని.. స్థానికులే.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవాళ్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. అందుకే పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశామన్న ముఖ్యమంత్రి.. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఆర్డినెన్స్ కూడా తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

“పోలీసులు సమర్థంగా పని చేయాలి. మద్య ప్రవాహాన్ని నియంత్రించాలి. నగదు పంపిణీని అడ్డుకోవాలి. గ్రామ స్థాయిలో పోలీసు మిత్రలు, మహిళా పోలీసులు విధుల్లో భాగం కావాలి. ఎస్పీ వరకు అంతా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా నగదు, మద్యం పంపిణీ చేశారన్న మాట వినిపించకూడదు. ఎన్నికల తర్వాత ఈ దిశగా ఎవరిపై అయినా ఆరోపణలు వస్తే చర్యలు తప్పవు. తప్పు రుజువు అయితే.. మూడేళ్ల వరకు శిక్ష తప్పదు” అంటూ జగన్.. ఉన్నతాధికారులతో సమీక్షలో స్పష్టం చేశారు.

నేరాలు, అక్రమాల నియంత్రణకు సాంకేతికత వినియోగాన్నీ సీఎం పరిశీలిస్తున్నారు. సిబ్బంది అందరి దగ్గరా అందుబాటులో ఉండేలా ఓ యాప్ ను తేవాలని చెప్పారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News