ఇదో వినూత్నం... ప్రతి బుధవారం... ఫిర్యాదుల వారం!

ముఖ్యమంత్రి జగన్.. మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బుధవారం మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో ఉండి.. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గ్రీవెన్స్ సెల్ నిర్వహణ ద్వారా.. ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ సత్వరమే పరిశీలించాల్సిందిగా సూచించారు. గతంలోనూ ఇలాంటి ఆదేశాలనే ఇచ్చిన సీఎం.. వాటిని కాస్త సవరించారు. మంగళ, బుధవారాలు సచివాలయంలో ఉండాలని గతంలో ఆదేశించగా.. ఆ నిర్ణయాన్ని తాజాగా ఒక రోజుకే […]

Advertisement
Update:2020-02-28 09:11 IST

ముఖ్యమంత్రి జగన్.. మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బుధవారం మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో ఉండి.. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గ్రీవెన్స్ సెల్ నిర్వహణ ద్వారా.. ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ సత్వరమే పరిశీలించాల్సిందిగా సూచించారు.

గతంలోనూ ఇలాంటి ఆదేశాలనే ఇచ్చిన సీఎం.. వాటిని కాస్త సవరించారు. మంగళ, బుధవారాలు సచివాలయంలో ఉండాలని గతంలో ఆదేశించగా.. ఆ నిర్ణయాన్ని తాజాగా ఒక రోజుకే పరిమితం చేశారు. ఫలితంగా.. మిగతా ఆరు రోజుల పాటు మంత్రులు తమ కార్యక్రమాలు ప్లాన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. అలాగే.. తమ నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి పర్యటనలు చేసేందుకూ వారికి అవకాశం కలిగింది.

ఒక రోజును పూర్తిగా సచివాలయానికి కేటాయించడం కూడా.. మంత్రిత్వ శాఖల పరిధిలోని నిర్ణయాలను సమీక్షించేందుకో.. పరిశీలించేందుకో వారికి అనువుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా.. ప్రజల సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించగలిగే వీలు ఏర్పడుతుంది. ఇది సాధ్యం అయితే.. జనాల్లోనూ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు పెరుగుతుంది.

ఇన్ని ఆలోచించారు కాబట్టే.. జగన్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విపక్షం విమర్శలు తిప్పికొట్టేలా తమ ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News