జాను క్లోజింగ్ కలెక్షన్లు

బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా కాస్తా కనీసం యావరేజ్ గా కూడా నిలబడలేకపోయింది. శర్వానంద్, సమంత కలిసి చేసిన జాను సినిమా ఒరిజినల్ మూవీ సృష్టించిన మేజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. దిల్ రాజు బ్యానర్ లో ఇదొక ఫ్లాప్ మూవీగా నిలిచింది. 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన ఈ సినిమా 8 కోట్ల దగ్గరే చతికిలపడింది. దీంతో ఆ మేరకు బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఆంధ్రా, తెలంగాణలో ఈ సినిమా 6 కోట్ల 47 […]

Advertisement
Update:2020-02-28 09:23 IST

బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా కాస్తా కనీసం యావరేజ్ గా కూడా నిలబడలేకపోయింది. శర్వానంద్, సమంత కలిసి చేసిన జాను సినిమా ఒరిజినల్ మూవీ సృష్టించిన మేజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. దిల్ రాజు బ్యానర్ లో ఇదొక ఫ్లాప్ మూవీగా నిలిచింది. 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన ఈ సినిమా 8 కోట్ల దగ్గరే చతికిలపడింది. దీంతో ఆ మేరకు బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.

ఆంధ్రా, తెలంగాణలో ఈ సినిమా 6 కోట్ల 47 లక్షల రూపాయల షేర్ దగ్గరే ఆగిపోయింది. నెల్లూరు లాంటి ఏరియాస్ నుంచి అయితే వసూళ్లు 25 లక్షలు కూడా దాటలేదు. నైజాంలో 2 కోట్ల 50 లక్షలు వచ్చినా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అటు ఓవర్సీస్ లో రిలీజైన రెండో రోజు నుంచే ఈ సినిమాను చూసే నాథుడు లేడు. ఫలితంగా 60 లక్షల రూపాయల దగ్గరే జాను ఆగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.5 కోట్లు
సీడెడ్ – రూ. 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.90 కోట్లు
ఈస్ట్ – రూ. 0.46 కోట్లు
వెస్ట్ – రూ. 0.35 కోట్లు
గుంటూరు – రూ. 0.60 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు
కృష్ణా – రూ. 0.56 కోట్లు

Tags:    
Advertisement

Similar News