సెంటిమెంట్ ఫాలో అవుతున్న టాలీవుడ్ స్టార్లు

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. ఈ విషయంలో సినిమావాళ్లు ఒక అడుగు ముందే ఉంటారు. సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్లు తప్పనిసరిగా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. లేకపోతే వాళ్ల సినిమాలు హిట్టు కావని బలంగా నమ్ముతుంటారు. అయితే అందరికీ ఒకే సెంటిమెంట్ వర్కౌట్ కాదు.. ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుంటారు. ఇక మన టాలీవుడ్ స్టార్లకు ఉన్న సెంటిమెంట్ మచ్చట్లపై ఓ లుక్కేద్దాం.. మెగాస్టార్ చిరంజీవి ఆయన నటించే సినిమాల్లో ఒక్క సీన్లోనైనా […]

Advertisement
Update:2020-02-26 14:30 IST

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. ఈ విషయంలో సినిమావాళ్లు ఒక అడుగు ముందే ఉంటారు. సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్లు తప్పనిసరిగా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. లేకపోతే వాళ్ల సినిమాలు హిట్టు కావని బలంగా నమ్ముతుంటారు. అయితే అందరికీ ఒకే సెంటిమెంట్ వర్కౌట్ కాదు.. ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుంటారు.

ఇక మన టాలీవుడ్ స్టార్లకు ఉన్న సెంటిమెంట్ మచ్చట్లపై ఓ లుక్కేద్దాం..

మెగాస్టార్ చిరంజీవి ఆయన నటించే సినిమాల్లో ఒక్క సీన్లోనైనా తెల్లరంగు చొక్కాతో కన్పించాల్సిందే. ఈ సెంటిమెంట్ ఆయన తొలిరోజుల నుంచి ఉంది. దీనినే ఇప్పటికీ మెగాస్టార్ పాటిస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన రాంచరణ్, సాయిధరమ్ తేజ్ లు తమ సినిమాల్లో మెగాస్టార్ పాటలను రీమేక్ చేయడం సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. మెగాస్టార్ పాటలుంటే తమ సినిమాలు హిట్టవుతాయనేది వారి నమ్మకం. అల్లు అర్జున్ కు వైజాగ్ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఆయన సినిమాల్లో ఒక్క షాట్ అయినా వైజాగ్ లో తీయాల్సిందేనట.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆయన సినిమా ముహుర్తం షాట్ కు హాజరవ్వరు. ప్రతీ సినిమాకు ముందు కడపలోని అమీర్ పీర్ దర్గాకు వెళ్తారు. ముంబైకి వెళ్తే మాత్రం మారియాట్ హోటల్లోనే బస చేస్తారు. అదేవిధంగా మహేష్ నటించే ప్రతీ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో రిలీజు కావాల్సిందేనట.

దర్శకుడు రాజమౌళి షూటింగ్ పూర్తయ్యే వరకు గడ్డం తీయడు. ఈ సెంటిమెంట్ ను ప్రతీ సినిమాకు కొనసాగిస్తున్నాడు. పూరి జగన్మాథ్ కు ఓ సెంటిమెంట్ ఉంది. శివ సినిమాకు రాంగోపాల్ వర్మకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఇప్పటికీ వర్మ దగ్గర స్టూడెంట్ లానే ఉంటాడు. రాజమౌళిలానే దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సినిమా పూర్తయ్యే వరకు గడ్డం తీయకపోవడం సెంటిమెంట్.

దర్శకులు, హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హీరోయిన్లు సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. ముందుగా కాజల్ సెంటిమెంట్ విషయానికొస్తే.. ఈ అమ్మడికి వైట్ డ్రెస్ సెంటిమెంట్. మగధీర ఓపెనింగ్లో వైట్ డ్రెస్ ధరించి సక్సస్ అందుకుంది. ఈ సెంటిమెంట్ కొనసాగిస్తుంది.

ఇక త్రిష సినిమాలో డ్రింక్ చేసే సీన్ లేదా వర్షం సీన్ ఉండాల్సిందేనట.

నయనతార లక్కి నెంబర్స్ ఫాలో అవుతుంది. తన సినిమా షూటింగ్ నెంబర్ 5తో ప్రారంభమయ్యేలా చూసుకుంటుంది.

ఇలియానా సినిమాలో బీచ్ సాంగ్ ఉంటే సినిమా హిట్టు అనేది దర్శక నిర్మాతల సెంటిమెంట్.

రకుల్ సైతం న్యూమరాలజీనే ఫాలో అవుతుంది. 1, 3 తేదీల్లో సినిమా షూటింగ్ ప్రారంభమయేలా చూసుకుంటుంది.

లావణ్య త్రిపాఠికి బ్లాక్ కలర్ సెంటిమెంట్ ఉంది. ఒక సీనైనా బ్లాక్ కలర్ డ్రెస్సులో కనిపించాల్సిందే.

Tags:    
Advertisement

Similar News