ఏం బతుకులు మీవి..? " టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి ఫైర్

ఏపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. అంతే కాకుండా పచ్చ పత్రికల్లో అమరావతికి అనుకూలంగా.. విశాఖ, కర్నూలుకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. మీడియాలో విశాఖపట్నానికి వ్యతిరేకంగా వార్తలు రావడంపై ఆయన మండిపడ్డారు. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో రాజధాని కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని.. ఆ నిర్ణయంపై నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై ఆయన విమర్శలు […]

Advertisement
Update:2020-02-23 11:54 IST

ఏపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. అంతే కాకుండా పచ్చ పత్రికల్లో అమరావతికి అనుకూలంగా.. విశాఖ, కర్నూలుకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. మీడియాలో విశాఖపట్నానికి వ్యతిరేకంగా వార్తలు రావడంపై ఆయన మండిపడ్డారు.

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో రాజధాని కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని.. ఆ నిర్ణయంపై నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై ఆయన విమర్శలు గుప్పించారు. బోగస్ వార్తలు రాసిన చంద్రజ్యోతిపైనా, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టిన పచ్చ పార్టీ నేతలపైనా దేశద్రోహం కేసులు పెట్టాలని విజయసాయి ట్వీట్ చేశారు.

ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకా దళాన్ని వివాదంలోకి లాగారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News