సెకెండ్ సిండ్రోమ్ అధిగమించిన దర్శకుడు

టాలీవుడ్ లో సెకెండ్ మూవీ సిండ్రోమ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. మొదటి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఎంతోమంది దర్శకులు రెండో సినిమాకు చతికిలపడిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అందుకే హీరోలు కూడా కొత్త దర్శకుల రెండో సినిమాకు ఛాన్స్ ఇవ్వడానికి జంకుతుంటారు. అయితే ఈ సిండ్రోమ్ ను అధిగమించిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో తాజాగా చేరాడు వెంకీ కుడుముల. ఛలో సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ, తన రెండో ప్రయత్నంగా నితిన్ […]

Advertisement
Update:2020-02-23 12:04 IST

టాలీవుడ్ లో సెకెండ్ మూవీ సిండ్రోమ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. మొదటి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఎంతోమంది దర్శకులు రెండో సినిమాకు చతికిలపడిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అందుకే హీరోలు కూడా కొత్త దర్శకుల రెండో సినిమాకు ఛాన్స్ ఇవ్వడానికి జంకుతుంటారు. అయితే ఈ సిండ్రోమ్ ను అధిగమించిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో తాజాగా చేరాడు వెంకీ కుడుముల.

ఛలో సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ, తన రెండో ప్రయత్నంగా నితిన్ తో భీష్మ సినిమా తీశాడు. సెకెండ్ మూవీ సిండ్రోమ్ ఎఫెక్ట్ ఇతడిపై కాస్త గట్టిగానే పడుతుందని, వన్ మూవీ వండర్ గా ఇతడు నిలిచిపోతాడని కొందరు విమర్శలు చేశారు. కానీ వెంకీ కుడుముల మాత్రం భీష్మతో మరో హిట్ కొట్టాడు. ఈసారి ఇంకాస్త గట్టిగా కొట్టాడు. ఛలో కంటే పెద్ద హిట్ భీష్మ. అలా సెకెండ్ మూవీ సిండ్రోమ్ ను సక్సెస్ ఫుల్ గా అధిగమించాడు వెంకీ.

రాజమౌళి, కొరటాల, బోయపాటి లాంటి దర్శకులు మాత్రమే రెండో సినిమాతో కూడా హిట్స్ ఇవ్వగలిగారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వెంకీ కుడుముల కూడా చేరిపోయాడు. ఈ లిస్ట్ లో మరికొంతమంది దర్శకులు కూడా ఉన్నారు. అయితే రెండో మూవీతో చతికిలపడిన దర్శకులే ఎక్కువమంది.

Tags:    
Advertisement

Similar News