'అవినీతి బయటపడితే.... బీసీ కార్డు బయటికి తీస్తారా?'

ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలు.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధాన్ని రాజేస్తున్నాయి. బీసీలను కావాలని అణగదొక్కుతున్నారంటూ.. టీడీపీ నేతలు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మద్దతుగా మాట్లాడుతుంటే.. వైసీపీ నేతలు టఫ్ కౌంటర్ ఇస్తున్నారు. అవినీతి బయటపడగానే.. బీసీ అన్న విషయాన్ని తీయడమేంటని నిలదీస్తున్నారు. బీసీలకు న్యాయం చేసింది జగన్ ప్రభుత్వమే అని లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ విషయమై.. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తీవ్రంగా స్పందించారు. తాను కూడా బీసీనే అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలను […]

Advertisement
Update:2020-02-23 05:37 IST

ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలు.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధాన్ని రాజేస్తున్నాయి. బీసీలను కావాలని అణగదొక్కుతున్నారంటూ.. టీడీపీ నేతలు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మద్దతుగా మాట్లాడుతుంటే.. వైసీపీ నేతలు టఫ్ కౌంటర్ ఇస్తున్నారు. అవినీతి బయటపడగానే.. బీసీ అన్న విషయాన్ని తీయడమేంటని నిలదీస్తున్నారు. బీసీలకు న్యాయం చేసింది జగన్ ప్రభుత్వమే అని లెక్కలతో సహా చెబుతున్నారు.

ఈ విషయమై.. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తీవ్రంగా స్పందించారు. తాను కూడా బీసీనే అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలను పార్థసారథి కూడా ఇదే విషయంపై స్పందించారు. టీడీపీ నేతలకు ఆరోపణలు రాగానే బీసీలమని డ్రామాలాడడం ఏంటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి అసలైన సామాజిక న్యాయాన్ని పాటించిన నాయకుడు వైఎస్ జగన్ అని పార్థసారథి చెప్పారు. ఇలాంటి న్యాయాన్ని గతంలో చంద్రబాబు ఎప్పుడైనా చేశారా.. అని నిలదీశారు.

వైసీపీ నేతల ప్రశ్నలకు తెదేపా నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. బీసీ కార్డు వాడకుండా.. ఆరోపణల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

గత ప్రభుత్వ పాలనలో చాలా మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని.. వారిలో అందరూ బీసీలే కాదని.. సాక్షాత్తూ గత ముఖ్యమంత్రి, తాను నిప్పు అని చెప్పుకొనే చంద్రబాబుపై కూడా వేలాది కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

చేతనైతే.. ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి.. లేదంటే తాము తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి.. కానీ ఇదేంటి.. అనవసరంగా బీసీలను వివాదంలోకి లాగుతున్నారు.. అని వైసీపీ నేతలంటున్నారు. దీనికి.. టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారో మరి.

Tags:    
Advertisement

Similar News