పొంగులేటికి కేసీఆర్ ఆ చాన్స్ ఇస్తారా?
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ స్థానాలు టీఆర్ఎస్‌కు దక్కబోతున్నాయి. ఈ సారి ఎవరికీ అవకాశం దక్కబోతుంది అనే దానిపై రకరకాల ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఇంతకుముందు ఓసీ, బీసీ వర్గాలకు కేసీఆర్ సీట్లు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కోటాలో కేకే, డి.శ్రీనివాస్, బడుగుల లింగయ్య యాదవ్, బండి ప్రకాష్ పెద్దల సభకు వెళ్లారు. ఓసీ కోటాలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సంతోష్ కుమార్ లకు ప్రాతినిధ్య దక్కింది. అయితే సామాజికవర్గాల ప్రకారం […]
తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ స్థానాలు టీఆర్ఎస్‌కు దక్కబోతున్నాయి. ఈ సారి ఎవరికీ అవకాశం దక్కబోతుంది అనే దానిపై రకరకాల ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఇంతకుముందు ఓసీ, బీసీ వర్గాలకు కేసీఆర్ సీట్లు ఇచ్చారు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కోటాలో కేకే, డి.శ్రీనివాస్, బడుగుల లింగయ్య యాదవ్, బండి ప్రకాష్ పెద్దల సభకు వెళ్లారు. ఓసీ కోటాలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సంతోష్ కుమార్ లకు ప్రాతినిధ్య దక్కింది. అయితే సామాజికవర్గాల ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకూ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేసీఆర్ చాన్స్ ఇవ్వలేదు. ఈ వర్గాలు తెలంగాణలో ఎక్కువగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాయి. దీంతో ఈ వర్గాలను అప్పట్లో ఆయన పక్కన పెట్టారని ప్రచారం నడిచింది.
అయితే ఇప్పుడు ఈసారి వీరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ పార్లమెంట్ లో అడుగుపెట్టే అదృష్టం ఉందని అంటున్నారు. ఈయనకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు అవకాశం దక్కింది. అప్పుడే పొంగులేటికి రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు ఆయనకు చాన్స్ ఇస్తారని సమాచారం.
ఎస్సీ, ఎస్టీ కోటాలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్, మందా జగన్నాథంలు కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. మనసులో మాట ఆయనకు చెరవేశారట. ఒక వేళ ఈ రెండు వర్గాలను పంపించకపోతే….మాజీ ఎంపీ కవితను పంపిస్తారని ఓ టాక్. మొత్తానికి కేసీఆర్ రాజ్యసభకు ఎవరిని పంపుతారనేది ఉత్కంఠగా మారింది.