ఆసియా కుస్తీలో భారత్ బంగారు మోత
మహిళల విభాగంలో మూడు స్వర్ణాలు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2020 ఆసియా కుస్తీ మహిళల విభాగంలో భారత వస్తాదులు బంగారు పతకాలతో శుభారంభాన్ని ఇచ్చారు. దివ్యకకరాన్, సరితామోర్, పింకీ తమతమ విభాగాలలో స్వర్ణపతకాలు సాధించారు. మహిళల విభాగంలోని ఐదు విభాగాలలో నాలుగింట భారత మహిళలు ఫైనల్స్ చేరుకోగా…ముగ్గురు బంగారు విజేతలుగా నిలిచారు. 68 కిలోల విభాగంలో దివ్య, 55 కిలోల విభాగంలో పింకీ, 59 కిలోల విభాగంలో సరిత బంగారు పతకాలు సాధించారు. 50 కిలోల విభాగంలో నిర్మలా దేవి […]
- మహిళల విభాగంలో మూడు స్వర్ణాలు
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2020 ఆసియా కుస్తీ మహిళల విభాగంలో భారత వస్తాదులు బంగారు పతకాలతో శుభారంభాన్ని ఇచ్చారు. దివ్యకకరాన్, సరితామోర్, పింకీ తమతమ విభాగాలలో స్వర్ణపతకాలు సాధించారు.
మహిళల విభాగంలోని ఐదు విభాగాలలో నాలుగింట భారత మహిళలు ఫైనల్స్ చేరుకోగా…ముగ్గురు బంగారు విజేతలుగా నిలిచారు. 68 కిలోల విభాగంలో దివ్య, 55 కిలోల విభాగంలో పింకీ, 59 కిలోల విభాగంలో సరిత బంగారు పతకాలు సాధించారు. 50 కిలోల విభాగంలో నిర్మలా దేవి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
76కిలోల విభాగంలో మాత్రమే కిరణ్ ఏ పతకమూ లేకుండా పోటీల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ టోర్నీ మొదటి మూడురోజుల పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 105 పాయింట్లతో టీమ్ చాంపియన్షిప్ అగ్రస్థానంలో నిలిచింది. 94 పాయింట్లతో జపాన్ రెండు, 77 పాయింట్లతో మంగోలియా మూడు, 70 పాయింట్లతో కజకిస్తాన్ నాలుగు, 55 పాయింట్లతో ఉజ్బెకిస్థాన్ ఐదుస్థానాలలో కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్ దెబ్బతో చైనా, కొరియాజట్లు టోర్నీకి దూరమయ్యాయి. ఆసియాకుస్తీలో రెండు అగ్రశ్రేణిజట్లు లేకుండానే పోటీలు జరుగుతున్నాయి. పురుషుల ఫ్రీ-స్టయిల్, గ్రీకో-రోమన్ స్టయిల్ విభాగాలలో భారత్ మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది.