భీష్మలో సేంద్రియ వ్యవసాయం

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న భీష్మ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది హీరోయిన్ రష్మిక. ఇది కేవలం లవ్ స్టోరీ కాదంటోంది. ఇందులో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా చర్చించామని చెబుతోంది. సినిమాలో మెసేజ్ పాయింట్ కూడా అదే అంటోంది రష్మిక. “మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ భీష్మలో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా […]

Advertisement
Update:2020-02-18 00:32 IST

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న భీష్మ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది హీరోయిన్ రష్మిక. ఇది కేవలం లవ్ స్టోరీ కాదంటోంది. ఇందులో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా చర్చించామని చెబుతోంది. సినిమాలో మెసేజ్ పాయింట్ కూడా అదే అంటోంది రష్మిక.

“మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ భీష్మలో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. భీష్మ అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే భీష్మ చాలా మంచి ఫిల్మ్.”

ఇలా భీష్మలో కీలకమైన విషయాన్ని చెప్పేసింది రష్మిక. ఈ సినిమాలో చైత్ర అనే మోడ్రన్ అమ్మాయి పాత్ర పోషిస్తున్నానని, భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీలో పనిచేసే పాత్ర తనది అంటోంది. ఇక నితిన్ గురించి మాట్లాడుతూ.. నితిన్ ను ఎప్పుడు చూసినా కాలేజ్ బాయ్ గా కనిపిస్తాడని అంటోంది.

“నేను సరదాగా చెప్పడం లేదు. ‘అ ఆ’లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం.”

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది భీష్మ. ఈ సినిమాపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో, ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ పైకి రావాలనుకుంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News