పవన్ నిర్మాత.... చరణ్ హీరో

ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన కాంబినేషన్ కాదు. దాదాపు మూడేళ్లుగా నలుగుతున్న కాంబోనే. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చరణ్ ను మీడియా అడిగే కామన్ ప్రశ్నల్లో ఇది కూడా ఉంటుంది. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ పట్టాలపైకి రాబోతోంది. మరో 4-5 నెలల్లో రామ్ చరణ్ హీరోగా, తను నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించబోతున్నాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఈ సినిమాల్ని కంప్లీట్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ […]

Advertisement
Update:2020-02-16 07:01 IST

ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన కాంబినేషన్ కాదు. దాదాపు మూడేళ్లుగా నలుగుతున్న కాంబోనే. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చరణ్ ను మీడియా అడిగే కామన్ ప్రశ్నల్లో ఇది కూడా ఉంటుంది. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ పట్టాలపైకి రాబోతోంది. మరో 4-5 నెలల్లో రామ్ చరణ్ హీరోగా, తను నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించబోతున్నాడు పవన్ కల్యాణ్.

ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఈ సినిమాల్ని కంప్లీట్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై చరణ్ హీరోగా సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్. కేవలం చరణ్ తో ఆగడం లేదు పవన్. సాయితేజ్ తో కూడా సినిమా నిర్మించే ఆలోచన ఉంది. వచ్చే ఎన్నికల్లోపు నిర్మాతగా ఈ 2 సినిమాల్ని పూర్తిచేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు.

వచ్చే ఎన్నికల సమయానికి 400 కోట్ల రూపాయలు సమీకరించాలనేది పవన్ ప్లాన్. అందుకే హీరోగా నటించడంతో పాటు.. ఇలా నిర్మాతగా మారబోతున్నాడు. అంతేకాకుండా.. ఎన్నికల టైమ్ కు అవసరమైతే మరో 3 అడ్వాన్స్ లు కూడా తీసుకునే ప్లాన్ లో ఉన్నాడు. మొత్తమ్మీద రాబోయే రోజుల్లో పవన్ రాజకీయాలకంటే సినిమా సెట్స్ పైకే ఎక్కువగా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఆర్-ఆర్-ఆర్ చేస్తున్నాడు చరణ్. ఆ తర్వాత కొరటాల శివ లేదా త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాడు. అది కంప్లీట్ అయిన తర్వాత పవన్ నిర్మాణంలో సినిమా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News