ఈ సారైనా వస్తావా రాజశేఖరా?

సరిగ్గా 9 ఏళ్ల కిందటి సినిమా ఇది. అప్పట్లో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఈ మూవీ. పైగా రాజశేఖర్ కు మార్కెట్ కూడా సున్నా. దీంతో అర్జున అనే సినిమాను అలా ల్యాబ్ లోనే వదిలేశారు. ఎప్పుడైతే గరుడవేగ సినిమా హిట్టయిందో, నిర్మాతల్లో మళ్లీ ఆశ మొదలైంది. అప్పట్నుంచి ఈ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకురావడం ప్రారంభించారు. అయితే ఆర్థిక కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. అందుకే 6నెలల నుంచి కిందామీద పడుతున్నారు. తాజాగా మరోసారి ఈ […]

Advertisement
Update:2020-02-16 00:32 IST

సరిగ్గా 9 ఏళ్ల కిందటి సినిమా ఇది. అప్పట్లో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఈ మూవీ. పైగా రాజశేఖర్ కు మార్కెట్ కూడా సున్నా. దీంతో అర్జున అనే సినిమాను అలా ల్యాబ్ లోనే వదిలేశారు. ఎప్పుడైతే గరుడవేగ సినిమా హిట్టయిందో, నిర్మాతల్లో మళ్లీ ఆశ మొదలైంది. అప్పట్నుంచి ఈ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకురావడం ప్రారంభించారు. అయితే ఆర్థిక కష్టాలు మాత్రం అలానే ఉన్నాయి. అందుకే 6నెలల నుంచి కిందామీద పడుతున్నారు.

తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చేసింది. ఈ నెలలోనే అర్జునను రిలీజ్ చేస్తామంటున్నారు నిర్మాత నట్టికుమార్. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నారాయన.

అర్జున సినిమాలో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ డ్యూయల్ రోల్ పోషించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ ఓ పాత్రలో రైతుగా కనిపించబోతున్నాడు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ… అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ కనిపిస్తాడు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. కనీసం ఈసారైనా ఈ సినిమా తెరపైకొస్తుందని ఆశిద్దాం.

Tags:    
Advertisement

Similar News