జై అమరావతి అనడట... రైతులకు పవన్ ఇలా షాక్ ఇచ్చాడు...
పవన్ ఆవేశం.. ఆయన్ను నమ్ముకున్న జన సైనికులకు, అభిమానులకు ఇబ్బంది కలిగిస్తోంది అనాలోచితంగా ఆయన అంటున్న మాటలు.. జనంలోనూ అసహనం పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని ఆయన తీరు.. జనసేనపై ఉన్న కాస్తంత నమ్మకాన్ని పూర్తిగా పోగొడుతోంది. తాజాగా.. అమరావతి గ్రామాల్లో పర్యటించిన పవన్.. అక్కడ దీక్ష చేస్తున్న వారికి ఓ వింత రియాక్షన్ ఇచ్చారన్న వార్త.. హాట్ టాపిక్ అయ్యింది. జై అమరావతి అని అనాలంటూ.. అమరావతి రైతులు కోరగా.. అందుకు పవన్ […]
పవన్ ఆవేశం.. ఆయన్ను నమ్ముకున్న జన సైనికులకు, అభిమానులకు ఇబ్బంది కలిగిస్తోంది అనాలోచితంగా ఆయన అంటున్న మాటలు.. జనంలోనూ అసహనం పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని ఆయన తీరు.. జనసేనపై ఉన్న కాస్తంత నమ్మకాన్ని పూర్తిగా పోగొడుతోంది.
తాజాగా.. అమరావతి గ్రామాల్లో పర్యటించిన పవన్.. అక్కడ దీక్ష చేస్తున్న వారికి ఓ వింత రియాక్షన్ ఇచ్చారన్న వార్త.. హాట్ టాపిక్ అయ్యింది.
జై అమరావతి అని అనాలంటూ.. అమరావతి రైతులు కోరగా.. అందుకు పవన్ అంగీకరించలేదట. అమరావతికి జై కొడితే ఇతర ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుందని సున్నితంగా తిరస్కరించాడట. కానీ.. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే మాత్రం ఊరుకోడట. దీంతో షాక్ అవ్వడం రైతుల వంతైంది.
అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల విషయంలో స్పష్టతతో ఉంది. ప్రతిపక్ష టీడీపీ కూడా.. చాలా మంది ఎమ్మెల్యేలు కలిసి రాకున్నా.. అమరావతి పోరాటాన్ని నెత్తినేసుకుంది. ఇన్నాళ్లూ అమరావతికే జనసేన కూడా మద్దతు అని భారీ ప్రకటనలే చేసింది. ఇలాంటప్పుడు.. జై అమరావతి అని అనకపోవడాన్ని ఎలా చూడాలి? మరోసారి రాబోయే మార్పునకు సంకేతంగా ఈ పరిణామాన్ని పరిగణించాలా? అని కొందరంటున్నారు.
ఇప్పటికైనా పవన్ కోసం ఆ పార్టీకి దగ్గరగా ఉండే నాయకులైనా జాగ్రత్తపడాలని…. కనీసం హాజరైన కార్యక్రమానికి అనుకూలంగా అయినా.. మాట్లాడేలా ప్రిపేర్ చేయాలని… లేదంటే.. జనంతో ఇలాగే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తదని అంటున్నారు ఆ పార్టీ కిందిస్థాయి అభిమానులు.