మహిళా టీ-20 టాప్ -10లో ముగ్గురు భారత క్రికెటర్లు

4వ ర్యాంక్ లో స్మృతి , 9వ ర్యాంక్ లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆస్ట్ర్రేలియా వేదికగా 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే..ఐసీసీ ప్రకటించిన వ్యక్తిగత ర్యాంకింగ్స్ … మొదటి 10 మందిలో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు. భారత డాషింగ్ ఓపెనర్ స్మృతిమంధానా ఇటీవలే ముగిసిన ముక్కోణపు సిరీస్ లో నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంక్ ను మూడుస్థానాల మేర మెరుగుపరచుకొని నాలుగో ర్యాంక్ కు చేరుకోగలిగింది. మరో యువప్లేయర్ […]

Advertisement
Update:2020-02-15 00:32 IST
  • 4వ ర్యాంక్ లో స్మృతి , 9వ ర్యాంక్ లో హర్మన్ ప్రీత్ కౌర్

ఆస్ట్ర్రేలియా వేదికగా 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే..ఐసీసీ ప్రకటించిన వ్యక్తిగత ర్యాంకింగ్స్ … మొదటి 10 మందిలో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు.

భారత డాషింగ్ ఓపెనర్ స్మృతిమంధానా ఇటీవలే ముగిసిన ముక్కోణపు సిరీస్ లో నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంక్ ను మూడుస్థానాల మేర మెరుగుపరచుకొని నాలుగో ర్యాంక్ కు చేరుకోగలిగింది.

మరో యువప్లేయర్ జెమీమా రోడ్రిగేస్ మాత్రం 7వ ర్యాంక్ కు పడిపోయింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన 9వ ర్యాంక్ ను నిలుపుకోగలిగింది.

బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకూ టాప్ -10లో ఉంటూ వచ్చిన పూనమ్ యాదవ్ 6వ ర్యాంక్ నుంచి 12వ ర్యాంక్ కు పడిపోయింది.

మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే టీ-20 ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా భారతజట్టు సైతం నిలిచింది. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది.

ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రపంచకప్ కు సన్నాహకంగా ముగిసిన ముక్కోణపు సిరీస్ లో భారత్ రన్నరప్ గా నిలవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోగలిగింది.

లీగ్ లో రెండోర్యాంక్ ఇంగ్లండ్, టాప్ ర్యాంక్ ఆస్ట్ర్రేలియాజట్లను కంగుతినిపించిన భారత మహిళలు ఫైనల్లో మాత్రం కంగారూల చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పొందక తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News