నిర్భయ కేసు.... కోర్టు హాలులో సొమ్మసిల్లిన జస్టిస్ భానుమతి

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఈ పిటిషన్‌ను జస్టీస్ భానుమతి విచారిస్తున్నారు. కాగా, వాదోపవాదాలు వినే సమయంలో జస్టీస్ భానుమతి సొమ్మసిల్లి కోర్టు హాలులోనే పడిపోయారు. దీంతో వెంటనే సహాయక సిబ్బంది ఆమెను ఛాంబర్‌లోనికి తీసుకెళ్లారు. విపరీతమైన జ్వరం, నీరసం కారణంగా ఆమె హాల్‌లోనే సొమ్మసిల్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఛాంబర్‌లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ […]

Advertisement
Update:2020-02-14 11:17 IST

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఈ పిటిషన్‌ను జస్టీస్ భానుమతి విచారిస్తున్నారు.

కాగా, వాదోపవాదాలు వినే సమయంలో జస్టీస్ భానుమతి సొమ్మసిల్లి కోర్టు హాలులోనే పడిపోయారు. దీంతో వెంటనే సహాయక సిబ్బంది ఆమెను ఛాంబర్‌లోనికి తీసుకెళ్లారు. విపరీతమైన జ్వరం, నీరసం కారణంగా ఆమె హాల్‌లోనే సొమ్మసిల్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఛాంబర్‌లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు.

మరోవైపు ఈ కేసులో దోషిగా నిరూపించబడిన వినయ్ శర్మ పెట్టుకున్న పిటీషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని అతడు సుప్రీంలో సవాలు చేశారు. దీనిని జస్టీస్ భానుమతి, జస్టీస్ అశోక్ భూషణ్, జస్టీస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించి.. చివరకు తిరస్కరించింది.

నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తనకు మానసిక స్థితి సరిగా లేదని.. తన ఉరిని రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. కాగా రాష్ట్రపతి ఆ పిటిషన్ ను తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

అయితే వినయ్ శర్మ మానసిక స్థితి సరిగానే ఉందని మెడికల్ రిపోర్టులు చెబుతుండటంతో సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ ను తిరస్కరించింది. కేవలం ఉరి శిక్షను ఆలస్యం చేయడానికే ఇలా ఒక్కొక్కరు దఫ దఫాలుగా పిటిషన్లు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News