చావు కబురు చెప్పడమే పని

కొత్త కంటెంట్, కొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయి టాలీవుడ్ లో. మూసకు స్వస్తి పలుకుతూ డిఫరెంట్ ఉండే స్టోరీల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే వస్తోంది ‘చావుకబురు చల్లగా’ అనే సినిమా. కార్తికేయ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై నిన్ననే ఈ సినిమా లాంఛ్ అయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో బస్తీ బాలరాజు అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు కార్తికేయ. అంతేకాదు.. ఇతడు మార్చురీ బండికి డ్రైవర్. ఆ బండికి […]

Advertisement
Update:2020-02-14 05:35 IST

కొత్త కంటెంట్, కొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయి టాలీవుడ్ లో. మూసకు స్వస్తి పలుకుతూ డిఫరెంట్ ఉండే స్టోరీల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే వస్తోంది ‘చావుకబురు చల్లగా’ అనే సినిమా. కార్తికేయ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై నిన్ననే ఈ సినిమా లాంఛ్ అయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

సినిమాలో బస్తీ బాలరాజు అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు కార్తికేయ. అంతేకాదు.. ఇతడు మార్చురీ బండికి డ్రైవర్. ఆ బండికి స్వర్గపురి వాహనం అనే పేరు కూడా పెట్టుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఆ బండికి ఏసీ కూడా పెట్టించాడు. ఇలాంటి క్యారెక్టర్ ను ఒకానొక టైమ్ లో అయితే ఏ హీరో అంగీకరించడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త క్యారెక్టర్లను హీరోలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కార్తికేయ, ఈ మార్చురీ వ్యాన్ డ్రైవర్ పాత్రను ఒప్పుకున్నాడు.

లాంఛింగ్ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ ను ప్రకటించారు. సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుంది. గీతాఆర్ట్స్2 బ్యానర్ లో ఆమెకిది వరుసగా మూడో సినిమా కావడం విశేషం. కొత్తకుర్రాడు కౌశిక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

Tags:    
Advertisement

Similar News