కేంద్రం చెప్పింది... పోలవరం గడువు పెరిగింది

పోలవరం జలాశయ నిర్మాణ పూర్తి గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. గతంలో… రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చకచకా పూర్తి అవుతున్నాయని తెలిపారు. ఇందుకు తగినట్టుగానే.. వచ్చే ఏడాదిలోగా పోలవరం నిర్మాణాన్నిపూర్తి చేసేందుకు గడువు పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఈ విషయంలో వేసిన ప్రశ్నకు కేంద్రం పై విధంగా.. లిఖిత పూర్వకంగా లోక్ సభలో […]

Advertisement
Update:2020-02-11 02:20 IST

పోలవరం జలాశయ నిర్మాణ పూర్తి గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. గతంలో… రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పనులు చకచకా పూర్తి అవుతున్నాయని తెలిపారు.

ఇందుకు తగినట్టుగానే.. వచ్చే ఏడాదిలోగా పోలవరం నిర్మాణాన్నిపూర్తి చేసేందుకు గడువు పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది.

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఈ విషయంలో వేసిన ప్రశ్నకు కేంద్రం పై విధంగా.. లిఖిత పూర్వకంగా లోక్ సభలో సమాధానం చెప్పింది. అసలు ఎంత ఖర్చు పెట్టారు.. ఎన్ని నిధులు ఇచ్చారని సుజనా ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి కటారియా.. కాంట్రాక్టు నిర్వహణ కారణాలతోనే గడువు పొడిగింపు అని వివరణ ఇచ్చారు. ఈ నెలలోనే 1,850 కోట్ల రూపాయల నిధులను పోలవరం నిర్మాణం నిమిత్తం విడుదల చేశామన్నారు.

వీటితో కలిపి.. ఇప్పటివరకూ 8,614.18 కోట్ల రూపాయలను కేంద్రం పోలవరానికి ఇచ్చిందని కటారియా చెప్పారు. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ఆయన నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ పూర్తి చేయగానే నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని పరోక్షంగా చెప్పారు. మొత్తానికి.. ఈ ప్రశ్న, సమాధానంలో తేలింది ఏంటంటే.. పోలవరం నిర్మాణానికి గడువు పెరిగింది.

జగన్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికే నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినట్టైంది.

Tags:    
Advertisement

Similar News