కిలాడీ టీడీపీ లేడీ లీడర్ అరెస్టు !
టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తి మోసాలు అప్పట్లో గుంటూరులో హాట్ టాపిక్‌గా మారాయి. బోడుపాలెంకు చెందిన దీప్తి టీడీపీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్టు బిల్లులు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు బాధితులు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసులు ఆమెను హైదరాబాద్‌లో ఆదివారం అరెస్టు చేశారు. గుంటూరులో పెదకాకాని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 11 రోజుల […]
టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తి మోసాలు అప్పట్లో గుంటూరులో హాట్ టాపిక్‌గా మారాయి. బోడుపాలెంకు చెందిన దీప్తి టీడీపీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్టు బిల్లులు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు బాధితులు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన పోలీసులు ఆమెను హైదరాబాద్‌లో ఆదివారం అరెస్టు చేశారు. గుంటూరులో పెదకాకాని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 11 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
గుంటూరుకు చెందిన మాజీ మంత్రి అండతో ఈ కిలాడీ లేడి రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యదర్శి పీఏ అని ఒకసారి, సీపీఎల్ ఏ పీఏ పేరుతో నకిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయకులను బురిడీ కొట్టించేది. సెక్రటేరియట్ తీసుకెళ్లి మంత్రుల చాంబర్‌లో హల్‌చల్ చేసేది. ఇది నమ్మి పని అవుతుందనే ఉద్దేశంతో బాధితులు ఆమెకు డబ్బు ఇచ్చేవారు. కడప జిల్లాకు చెందిన వల్లభ రెడ్డి, రామకృష్ణారెడ్డి తో పాటు గుంటూరుకు చెందిన కొందరు ఈమె చేతిలో మోసపోయారు. గత అక్టోబర్ 15న వీరంతా పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన మన్నవ వంశీకృష్ణ… నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి లక్షల రూపాయల పనులు చేసినా బిల్లులు రాలేదు. దీంతో సచివాలయం చుట్టూ తిరుగుతుండగా గమనించిన దీప్తి వీరిని కలిసింది. తాను బిల్లులు ఇప్పిస్తానని చెప్పి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుంది. అటు బిల్లులు రాలేదు. ఇటు డబ్బులు తీసుకున్న తర్వాత మొహం చాటేసింది. దీంతో ఇప్పుడు బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీప్తి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమె కోసం వెతికారు. మూడు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్‌లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహణ కాంట్రాక్ట్ ను పొందింది. ప్రతి వారం హ్యాపీ సండే పేరిట కార్యక్రమం నిర్వహిస్తూ 60 వేల రూపాయలు వసూలు చేసింది. ఈ కార్యక్రమం బిల్లుల కోసం అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి పాస్ చేయించుకునేది. తన సామాజికవర్గంకు చెందిన అధికారులు, మంత్రుల దగ్గరకు రెగ్యులర్‌గా వెళ్లి తనకు పరపతి ఉందని బిల్డప్ ఇచ్చేది. టీడీపీ నేతలతో ఫొటోలు దిగి…. వాటిని చూపించి అమాయకులను నమ్మించేది. మొత్తానికి ఈ కిలాడీ లేడీ మోసాలకు ఇప్పుడు చెక్ పడింది.