ఓ ఆసక్తికర చర్చ: విజయశాంతి దారి ఎటు?

సినిమాల్లో నటించేది లేదని దాదాపుగా తేల్చేశారు.. లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తనను ఆదరించి.. ప్రేమను చూపించినందకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇక సినిమాలు చేసే అవకాశం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇదే.. టాలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకూ ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. సీనియర్ నటి, మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి.. అని చాలా మంది […]

Advertisement
Update:2020-02-04 02:38 IST

సినిమాల్లో నటించేది లేదని దాదాపుగా తేల్చేశారు.. లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తనను ఆదరించి.. ప్రేమను చూపించినందకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇక సినిమాలు చేసే అవకాశం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇదే.. టాలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకూ ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.

సీనియర్ నటి, మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి.. అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ విశేష సంఖ్యలో విజయశాంతిని అభిమానించే అలనాటి సినీ ప్రేక్షకులు ఉన్నారు. వారందరినీ అసంతృప్తికి గురి చేస్తూ.. విజయశాంతి ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్టు.. అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.

ఈ ప్రశ్నల పరంపరకు.. విజయశాంతి వర్గాల వైపు నుంచి ఎలాంటి స్పందన రాకున్నా.. రాజకీయ వర్గాల నుంచి మాత్రం మరో విధంగా విశ్లేషణ వినిపిస్తోంది. టీఆర్ఎస్ తో రాజకీయాల్లో మెరిసి.. అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి.. తాజా రాజకీయ పరిస్థితుల కారణంగా.. కొంత కాలంగా రాములమ్మ అలియాస్ విజయశాంతి సైలెంట్ గా ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు పంచ్ లతో చెలరేగుతున్నా.. యాక్టివ్ గా లేరన్నది మాత్రం నిజం.

ఇలాంటి పరిస్థితుల్లో.. విజయశాంతి బీజేపీ వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీకి తెలంగాణ పబ్లిక్ లో ఇమేజ్ ఉన్న విజయశాంతిలాంటి వాళ్ల అవసరం కూడా ఉందన్నది కొందరు బీజేపీ నేతల అభిప్రాయం. అందుకే.. ఆమె దూకుడుగా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టు పలువురు భావిస్తున్నారు. విజయశాంతి ఎప్పుడు ఈ విషయంలో స్పష్టత ఇస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News