ఇది నిజంగానే నాన్-బాహుబలి రికార్డ్
ఓవర్సీస్ లో నిజంగానే నాన్-బాహుబలి రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్. అతడి నటించిన అల వైకుంఠపురములో సినిమా యూఎస్ లో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. మొన్నటివరకు ఈ రికార్డు రామ్ చరణ్ పేరిట ఉండేది. బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తర్వాత రంగస్థలం మూడో స్థానంలో కొనసాగేది. ఇప్పుడా స్థానాన్ని బన్నీ ఆక్రమించాడు. వరుసగా నాలుగో శనివారం అల వైకుంఠపురములో సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. నాలుగో శనివారం 40వేల డాలర్ల వసూళ్లు అంటే నిజంగా అది […]
ఓవర్సీస్ లో నిజంగానే నాన్-బాహుబలి రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్. అతడి నటించిన అల వైకుంఠపురములో సినిమా యూఎస్ లో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. మొన్నటివరకు ఈ రికార్డు రామ్ చరణ్ పేరిట ఉండేది. బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తర్వాత రంగస్థలం మూడో స్థానంలో కొనసాగేది. ఇప్పుడా స్థానాన్ని బన్నీ ఆక్రమించాడు.
వరుసగా నాలుగో శనివారం అల వైకుంఠపురములో సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. నాలుగో శనివారం 40వేల డాలర్ల వసూళ్లు అంటే నిజంగా అది గ్రేట్. అలా శనివారం నాటి వసూళ్లతో ఇది నాన్-బాహుబలి రికార్డును అందుకుంది.
తాజా వసూళ్లతో 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరాడు బన్నీ. ఇతడి కెరీర్ లో ఇదే తొలి 3 మిలియన్ డాలర్ క్లబ్. అటు దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రస్తుతం ఓవర్సీస్ లో ఆల్ టైమ్ హిట్ టాప్-5 సినిమాల లిస్ట్ ఇలా ఉంది.
- బాహుబలి 2 – $ 20,571,695
- బాహుబలి 1 – $ 6,999,312
- అల వైకుంఠపురములో – $ 3.52 మిలియన్ (21 రోజులు)
- రంగస్థలం – $ 3,513,328
- భరత్ అనే నేను – $ 3,416,411