అల్లు అరవింద్ కు పోటీగా దిల్ రాజు... రసవత్తర పోరు

దేశం ఇప్పుడు డిజిటల్ మయం అయిపోయింది. అందరూ థియేటర్ కు వచ్చి సినిమాలు చూసేంత సమయం లేకుండా పోయింది. అంతా ఆన్ లైన్, మొబైల్ లోనే క్రికెట్ సహా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలం ఇదీ. అందుకే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ దే భవిష్యత్ అని అందరూ ఆ బాట పడుతున్నారు. ఇప్పటికే దేశంలో అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ద్వారా మంచి క్వాలిటీ కంటెంట్ గల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిని చూసేవారి సంఖ్య […]

Advertisement
Update:2020-02-01 11:08 IST

దేశం ఇప్పుడు డిజిటల్ మయం అయిపోయింది. అందరూ థియేటర్ కు వచ్చి సినిమాలు చూసేంత సమయం లేకుండా పోయింది. అంతా ఆన్ లైన్, మొబైల్ లోనే క్రికెట్ సహా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలం ఇదీ. అందుకే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ దే భవిష్యత్ అని అందరూ ఆ బాట పడుతున్నారు.

ఇప్పటికే దేశంలో అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ద్వారా మంచి క్వాలిటీ కంటెంట్ గల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిని చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

దీంతో భవిష్యత్ డిజిటల్ మీడియాదేనని గ్రహించిన టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ‘ఓటీటీ’ అనే డిజిటల్ ఫ్టాట్ ఫామ్స్ లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. తమ మెగా హీరోల సినిమాలందరినీ ఇందులోనే రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఇక మిగతా హీరోల సినిమాలను కొనేసి విడుదల చేయాలని చూస్తున్నారు.

ఓటీటీ ప్రతీ సినిమాకు కొంత మొత్తం వసూలు చేస్తుంది. సంవత్సరం సబ్ స్క్ప్రిషన్ ఉంటుంది. దీంతో లాభాల పంట పండించవచ్చు

ఇక అల్లు అరవింద్ తర్వాత తెలుగులో విజయవంతమైన ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సైతం ఇప్పుడు డిజిటల్ ఫ్టాట్ ఫామ్ లోకి అడుగు పెడుతున్నారు. టాలీవుడ్ లోనే చాలా తెలివైన బిజినెస్ స్ట్రాటజీలు అమలు చేస్తూ విజయాలను అందుకుంటున్న దిల్ రాజు సైతం అల్లు అరవింద్ బాటలో కొత్త డిజిటల్ ఫ్టాట్ ఫామ్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారట.. సో ఇప్పుడు భవిష్యత్తును అంచనా వేసి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కొత్త పుంతలు తొక్కుతుండడం విశేషంగా మారింది.

Tags:    
Advertisement

Similar News