ఆహా.. మరో సినిమా దక్కించుకున్నారు

ఓటీటీ అంటే అందరికీ అమెజాన్ ప్రైమ్ మాత్రమే గుర్తొస్తుంది. ఆ తర్వాతే నెట్ ఫ్లిక్స్ అయినా, జీ5 అయినా. కానీ త్వరలోనే ఈ ఈక్వేషన్స్ మారబోతున్నాయి. చాపకింద నీరులా అల్లు అరవింద్ కు చెందిన ఓ యాప్ దూసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ యాప్ ను ఆన్ లైన్ లోకి కూడా తీసుకొచ్చారు. కావాలనే ప్రమోట్ చేయకుండా, ఫీడ్ బ్యాక్ కోసం చూస్తున్నారు. పైగా అగ్రిమెంట్స్ జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈ సైలెన్స్. మరోవైపు కొత్త […]

Advertisement
Update:2020-02-01 11:02 IST

ఓటీటీ అంటే అందరికీ అమెజాన్ ప్రైమ్ మాత్రమే గుర్తొస్తుంది. ఆ తర్వాతే నెట్ ఫ్లిక్స్ అయినా, జీ5 అయినా. కానీ త్వరలోనే ఈ ఈక్వేషన్స్ మారబోతున్నాయి. చాపకింద నీరులా అల్లు అరవింద్ కు చెందిన ఓ యాప్ దూసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ యాప్ ను ఆన్ లైన్ లోకి కూడా తీసుకొచ్చారు. కావాలనే ప్రమోట్ చేయకుండా, ఫీడ్ బ్యాక్ కోసం చూస్తున్నారు. పైగా అగ్రిమెంట్స్ జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈ సైలెన్స్.

మరోవైపు కొత్త సినిమాల రైట్స్ దక్కించుకునే కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే అర్జున్ సురవరం సినిమాను AHA యాప్ లో పెట్టారు. కార్తి హిట్ మూవీ ఖైదీ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు రిలీజైన చూసీ చూడంగానే అనే సినిమా డిజిటల్ రైట్స్ ను కూడా అల్లు అరవింద్ తీసుకున్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. సురేష్ ప్రొడక్షన్స్, మల్లెమాల, గీతాఆర్ట్స్ కు చెందిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఇంకా రావాల్సి ఉంది. ఇతర సంస్థల వద్ద ఉన్న ఆ సినిమాలు కాలపరిమితి ముగియగానే AHA యాప్ లో ప్రత్యక్షం కాబోతున్నాయి.

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎవడు సినిమాలతో పాటు చిరంజీవి నటించిన ఠాగూర్, ఘరానా మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు లాంటి హిట్ సినిమాలు ఇందులో ఉన్నాయి.

అర్జున్ సురవరం లాంటి 2-3 సినిమాలు మినహాయిస్తే.. మిగతా సినిమాలన్నింటినీ ఉచితంగానే చూసే అవకాశం కల్పిస్తోంది AHA. కొన్నాళ్ల తర్వాత మాత్రం నెలకు 149 రూపాయలు చెల్లించాల్సిందే.

Tags:    
Advertisement

Similar News