ఆర్ఆర్ఆర్ కు.... రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ల పారితోషికం ఎంతంటే...

సినిమా తీయకముందే బేరం ఆడుకొని నాకింత, నీకింత అని నిర్మాతను పీల్చి పిప్పి చేసేకంటే.. మన టాలెంట్ తో సినిమాను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి మార్కెట్ చేసి వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలన్న తెలివిగల నిర్ణయాలను దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసుకుంటారు. కేవలం సినిమా తీసి వదిలేయకుండా ఆ సినిమాను ఎలా మార్కెట్ చేయాలో.. ఎలా హైప్ క్రియేట్ చేయాలో.. ఎలా కోట్లు సంపాదించాలో రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు. ఆయన తీసిన బాహుబలి సినిమాకు […]

Advertisement
Update:2020-01-30 13:55 IST

సినిమా తీయకముందే బేరం ఆడుకొని నాకింత, నీకింత అని నిర్మాతను పీల్చి పిప్పి చేసేకంటే.. మన టాలెంట్ తో సినిమాను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి మార్కెట్ చేసి వచ్చిన లాభాలను సమానంగా పంచుకోవాలన్న తెలివిగల నిర్ణయాలను దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసుకుంటారు.

కేవలం సినిమా తీసి వదిలేయకుండా ఆ సినిమాను ఎలా మార్కెట్ చేయాలో.. ఎలా హైప్ క్రియేట్ చేయాలో.. ఎలా కోట్లు సంపాదించాలో రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు.

ఆయన తీసిన బాహుబలి సినిమాకు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కించి కోట్లు కొల్లగొట్టించిన ఘనత ఆయన సొంతం. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీకి అదే స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడట.

మామూలుగా సినిమాలో నటించే హీరోలకు ముందే 20 నుంచి 50 కోట్ల వరకూ పారితోషికాన్ని నిర్మాతలు ముట్టజెప్పుతారు. దర్శకుడికి 10 కోట్ల వరకూ ఇస్తుంటారు. కానీ రాజమౌళి మాత్రం సినిమాకు ముందు తీసుకోవడం లేదట. ఆసినిమా విజయాల అనంతరం ప్యాకేజీ, పర్సంటేజీ మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంత శాతం రాజమౌళికి వస్తుందన్నమాట..

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా లాభాల్లో వాటా ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారట.. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన హీరో అజయ్ దేవగణ్ కు కూడా హిందీ మార్కెట్ వాటాలో షేర్ ఇవ్వనున్నారట.. ఇలా నిర్మాత డీవీవీ దానయ్య సినిమాలో కీలకంగా ఉన్న ముగ్గురు హీరోలు, దర్శకుడు రాజమౌళికే సగం ప్రాఫిట్ ఇవ్వాల్సి వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. సగం బడ్జెట్ ఈ నలుగురికేనన్న చర్చ సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News