టక్ జగదీష్ పని మొదలుపెట్టాడు

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమాను ఈమధ్యే పూర్తిచేశాడు నాని. వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈరోజు నాని హీరోగా టెక్ జగదీష్ అనే సినిమా లాంఛ్ అయింది. ఇదేదో కొత్తగా ప్రకటించిన సినిమా కాదు. ఇంతకుముందే ఈ ప్రాజెక్ట్ ను టైటిల్ తో సహా ప్రకటించారు. ఆ సినిమానే ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోంది టక్ జగదీష్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో నిన్ను కోరి అనే […]

Advertisement
Update:2020-01-30 14:59 IST

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమాను ఈమధ్యే పూర్తిచేశాడు నాని. వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈరోజు నాని హీరోగా టెక్ జగదీష్ అనే సినిమా లాంఛ్ అయింది. ఇదేదో కొత్తగా ప్రకటించిన సినిమా కాదు. ఇంతకుముందే ఈ ప్రాజెక్ట్ ను టైటిల్ తో సహా ప్రకటించారు. ఆ సినిమానే ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోంది టక్ జగదీష్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో నిన్ను కోరి అనే సినిమా వచ్చింది. ఇది రెండో సినిమా. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. పొలాచ్చిలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలుగా ఈ సినిమా మొదలుకాబోతోంది.

ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్లుగా తీసుకున్నారు. అలా అని ఇది ట్రయాంగిల్ ప్రేమకథ కాదు. కొన్ని సున్నితమైన భావాలతో ఈ కథ రాసుకున్నాడు నిర్వాణ. సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నాడు. నాని-జగపతిబాబు మధ్య సన్నివేశాలు సినిమాకు హైలెట్ అంటున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.

Tags:    
Advertisement

Similar News